సౌత్ సినిమాలపై రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు..?
కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది రకుల్ ప్రీత సింగ్. సౌత్ సినిమాలు తనకులైఫ్ ఇవ్వడం లేదు అనుకుందో ఏమో కాని. బాలీవుడ్ ను బాగా వెనకేసుకొచ్చింది. ఇంతకీ ఆమె ఏం చేసింది..? సంగతేంటి..?

Rakul Preeth Singh
టాలీవుడ్ లో చిన్న సినిమాతో స్టార్ట్ అయ్యి .. స్టార్ బ్యూటీగామారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది బ్యూటీ. దాదాపు పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో వెలిగిపోతుంది రకుల్ ప్రీత్. ఆమధ్యే ఆమెకు అవకాశాలు పడిపోయాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేవు. దాంతో బాలీవుడ్ లో గట్టిగా ట్రై చేస్తోంది చిన్నది.
Rakul preeth Singh
బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈమె వాలకం చూస్తుంటే.. ఇక టాలీవుడ్ కు రామ్ రామ్ చెప్పేలాగే ఉంది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ అన్న మాటలు అదే చెపుతున్నాయి. తనకు జీవితాన్ని ఇచ్చిన సౌత్ ను హెళన చేస్తూ.. బాలీవుడ్ ను వెనకేసుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
Rakul Preeth Singh
ప్రస్తుతం బాలీవుడ్ లో సౌత్ హీరోల హవా నడుస్తోంది. దాంతో అక్కడి హీరోలు తట్టుకోలేకపోతున్నారు. ఇటుసౌత్ హీరోలకు.. బాలీవుడ్ హీరోలకు మధ్య ఫిల్మ్ వార్ జరుగుతుంది. కాగా ఇలాంటి మూమెంట్లోనే రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
Rakul Preeth Singh
ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్... కు ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది. రీసెంట్గా ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ..బాలీవుడ్ సౌత్-నార్త్ సినిమాల గురించిన ప్రశ్న ఎదురయింది . ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ రెస్పాండ్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Rakul Preeth Singh
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ మాటలు వింటూనే ఉన్నాను . సౌత్, బాలీవుడ్ ను చంపేసింది.. సౌత్ సినిమాలు వల్ల బాలీవుడ్ ఎదగలేక పోతుంది అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు . బాలీవుడ్ పనైపోయింది.. ఇక బాలీవుడ్ ఎదగలేదు ఇండస్ట్రీకి ఇక సౌత్ ఫిలిం సే ప్రాణం పోయాలి అంటున్నారు. కాని ఈ విషయం నేను ఒప్పకోను అంది బ్యూటీ.
Rakul Preeth Singh,
సినిమా ఎక్కడైనా సినిమానే అది నార్త్ కాదు సౌత్ కాదు. ఏ సినిమా హిట్ అయిన దానికి మూల కారణం అందులోని యాక్టర్స్ మాత్రమే. వాళ్ళతో పాటు దర్శకుడు..టెక్నికల్ టీమ్ కష్టపడితేనే సినిమా హిట్ అవుతుంది.అది నార్త్ వాళ్ళు కాదు సౌత్ వాళ్ళు కాదు ఎవరైనా సరే మంచి కథ తో పాటు టాలెంట్ కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా హీట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది.
rakul preeth singh
ప్రస్తుతం బాలీవుడ్ గురించి చెప్పుకొస్తూ.. ప్రస్తుతం కష్టపడినా.. ఇలా బ్రేక్స్ పడొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అన్ని ఇండస్ట్రీలు కలిసిపోతాయి .. ఈలోపు ఇలాంటి మాటలు మాట్లాడటం టైం వేస్ట్ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకోచ్చారు.
దీంతో ఈ విషయంపై సౌత్ ఆడియన్స్ మండి పడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ను వెనకేసుకొచ్చిందని ఆమెకు సౌత్ లో ఇక సినిమా ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ మండిపడుతున్నారు. సౌత్ లో అవకాశాలు రాకపోవడంతో ఇలా అక్కసు వెళ్ళగగ్గుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. రకుల్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.