- Home
- Entertainment
- అతిగా ఆపని చేయడం వల్ల హాస్పిటల్ పాలైయిన రకుల్ ప్రీత్ సింగ్...? ఆందోళనలో అభిమానులు..?
అతిగా ఆపని చేయడం వల్ల హాస్పిటల్ పాలైయిన రకుల్ ప్రీత్ సింగ్...? ఆందోళనలో అభిమానులు..?
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాస్పిటల్ పాలు అయ్యింద. అభిమానులంతా ఆందోళనలో ఉన్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ విషయంలో నిజమెంత...? ఇంతకీ ఆమెకు ఏమయ్యింది..?

తనదైన స్టైల్ నటనతో.. బోల్డ్ ఫోజులతో. ఎమోషనల్ ఎక్స్ ప్రెషన్స్ తో.. డాన్స్ స్కిల్స్ తో.. ఒకటేమిటి.. ఇలా అన్నింటా తనటాలెంట్ చూపిస్తూ.. యాక్టింగ్ తో కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. ఎందుకో రకుల్ అంతగా రిజిస్టర్ అవ్వలేక పోయింది ఆడియన్స్ లో.
టాలీవుడ్ లో పెద్దగా ఉపయోగం లేదు అనుకుందో ఏమో.. ఇక్కడ కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ కూడా తన టాలెంట్ చూపించింది. కాని పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. అయితే తన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి నటిగా మాత్రం గుర్తింపు సాదించింది బ్యూటీ.
అయితే రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె హాస్పిటలైజ్ అయ్యిందని. ప్రస్తుతం రెస్ట్ లో ఉందని వార్తలు వైరల్ అవుతున్న వేళ.. ఆమెకు ఏమయ్యిందని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
రకుల్ ఎక్కడ సినిమాలు చేసినా.. ఒక విషయంలో మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుంది. బాడీ ఫిట్నెస్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే.. ఆమె రోజులో ఖాళీగా ఉన్న సమయాన్ని ఎక్కువగా బిజిమ్ కే కేటాయిస్తుంది. ఒక్కోసారి రోజుకి 6 గంటలు జిమ్ వర్కౌట్ చేసిన సంరద్భాలు కూడా ఉన్నాయి. ఈమధ్య ఇలా చేసే..గుర్తుపట్టలేనంతగా స్లిమ్ గా తయారయ్యింది.
అయితే పెరుగుతున్న కాంపిటేషన్.. పెరుగుతున్న వయస్సు దృష్టిలో ఉంచుకుని.. బాడీని కరెక్ట్ షేప్ లో ఉంచుకోవాలని.. ఆమె తెగ కష్టపడుతందట. ఇంకా ఫిట్ గా ఉండాలి అందంగా తయారవ్వాలి అని రకుల్ ఓవర్ కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు హాస్పిటల్ పాలైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Image: Rakul Preet SIngh/Instagram
నాజుగా కనపడటానికి జీరో సైజ్ తెచ్చుకోవడానికి రకుల్ డైటింగ్ అంటూ హెవీ వర్కౌట్ చేస్తూ.. సృహ తప్పి పడిపోయిందట. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించారని సమాచారం. అయితే దీనిపై రకుల్ మేనేజర్ కాని రాకుల్ కాని రకుల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్పందించలేదు. ఈ విషయం బయట పెట్టడానికి వాళ్ళు ఇష్టపడట్లేదని సోషల్ మీడియాలో వార్త హైలెట్ అవుతోంది.
ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే రకుల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ప్రజెంట్ రకుల్ కి ఎలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..? ఇక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రకుల్. టాలీవుడ్ ఎంట్రీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ అల్లు అర్జున్ , మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్, చైతూ లాంటి స్టార్స్ తో మంచి మంచి సినిమాలు చేసింది.