అందం అసూయపడేలా పూర్ణ సోయగాలు... ఢీ జడ్జి గ్లామర్ ని ఆస్వాదించాలంటే రెండు కళ్ళు చాలవట!
తల్లైన పూర్ణ కొన్నాళ్ళు గ్లామరస్ ఫోటో షూట్స్ కి దూరంగా ఉంది. ఆమె మరలా తిరిగి బిజీ అయ్యారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ ని తన అందాలతో ఎంటర్టైన్ చేస్తున్నారు.
Purnaa
చుడిదార్ లో కట్టిపడేసింది హీరోయిన్ పూర్ణ. ఆమె అందాలు ఆస్వాదించడానికి రెండు కళ్ళు చాలవు అంటే అతిశయోక్తి కాదు. నిండైన బట్టల్లో చందమామలా మెరిసింది. పూర్ణ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Purnaa
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దుబాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించారు. దీంతో ఆమె కొంచెం గ్యాప్ తీసుకున్నారు. తిరిగి ఆమె బిజీ అయ్యారు.
Purnaa
బ్లాక్ బస్టర్ దసరా మూవీలో పూర్ణ విలన్ భార్యగా ఇంటెన్స్ రోల్ చేశారు. అలాగే ఢీ సీజన్ 16 జడ్జిగా వ్యవహరించనున్నారు. అలాగే పలు చిత్రాల్లో కీలక రోల్స్ లో కనిపించనున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Purnaa
2022లో పూర్ణ దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని రహస్య వివాహం చేసుకుంది. నిశ్చితార్థం గురించి చెప్పి ఆమె వివాహం జరిగిన సంగతి దాచారు. అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటే... ఆల్రెడీ జరిగిపోయిందని వెల్లడించారు.
Purnaa
మీడియాతో మాట్లాడుతూ పూర్ణ... మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ వెల్లడించారు.
Purnaa
ఇక ఇండియాలో ఉన్న బంధువులు, సన్నిహితులు, స్నేహితుల కోసం కేరళలో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చారు. కానీ అలాంటి వేడుక ఏదీ జరపలేదు. అప్పుడే పూర్ణకు కొడుకు కూడా పుట్టేశాడు.
Purnaa
భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. ఆమెకు క్యారెక్టర్ రోల్స్ దక్కుతున్నాయి. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అమ్మడు మెప్పిస్తున్నారు.
Purnaa
ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన సినిమాలు వాడుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు.