- Home
- Entertainment
- చిలక పచ్చ కోక పెట్టినాది కేక... కొప్పున మల్లెలు పెట్టి కవ్విస్తున్న హీరోయిన్ పూర్ణ!
చిలక పచ్చ కోక పెట్టినాది కేక... కొప్పున మల్లెలు పెట్టి కవ్విస్తున్న హీరోయిన్ పూర్ణ!
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. పట్టు చీర కట్టి నిండుగా ముస్తాబైన పూర్ణ సరికొత్తగా దర్శనమిచ్చింది.

Purna
సోషల్ మీడియా వేదికగా తనలోని అందాలను పరిచయం చేస్తుంది పూర్ణ. తాజాగా ఆమె పట్టుచీర, కొప్పున పూలు పెట్టి కొంటెగా ముస్తాబయింది. ఆమె చూపులు కుర్రకారును కవ్విస్తున్నాయి.
Purna
పూర్ణ హోమ్లీ లుక్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. చీరలో మీరు చాలా అందంగా ఉన్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. పూర్ణ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Purna
పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం. పూర్ణ స్క్రీన్ నేమ్ గా చేసుకుంది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సీమ టపాకాయ్, అవును వంటి హిట్ చిత్రాల్లో నటించిన పూర్ణ ఆ జోరు చూపించలేకపోయారు. హీరోయిన్ గా రిటైర్ అయిన ఈ మలయాళీ భామ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
Purna
గత ఏడాది వివాహం చేసుకున్న పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దుబాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించారు. దీంతో ఆమె కొంచెం గ్యాప్ తీసుకున్నారు. తిరిగి ఆమె బిజీ అయ్యారు.
Purna
ఢీ సీజన్ 16 జడ్జిగా వ్యవహరించనున్నారు. అలాగే పలు చిత్రాల్లో కీలక రోల్స్ లో కనిపించనున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పూర్ణ గోప్యంగా దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పూర్ణకు వివాహం జరిగింది.
Purna
నిశ్చితార్థం విషయం చెప్పి ఆమె వివాహం జరిగిన సంగతి దాచారు. అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటే... ఆల్రెడీ జరిగిపోయిందని వెల్లడించారు.
Purna
మీడియాతో మాట్లాడుతూ పూర్ణ... 2022 మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ వెల్లడించారు.
Purna
భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. తాజాగా మొదలైన ఢీ లేటెస్ట్ సీజన్ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. గత ఏడాది పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది.
Purna
పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఆమెకు క్యారెక్టర్ రోల్స్ దక్కుతున్నాయి. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. అఖండలో ప్రభుత్వ ఉద్యోగి పాత్ర చేశారు. దృశ్యం 2లో లాయర్ గా మెప్పించారు.
Purna
లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దసరాలో విలన్ భార్య పాత్రలో చేసింది. నాని-కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా భారీ విజయం సాధించింది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.