చుడిదార్ కట్టిన చందమామ.... పొద్దికైన అందాలతో ముద్దొస్తున్న పూర్ణ..!
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు.అలాగే అందగత్తెలు బొద్దుగా ఉన్న ముద్దొస్తారు. దానికి పూర్ణనే ఉదాహరణ. సాంప్రదాయ చుడిదార్ లో చూపు తిప్పుకోకుండా కట్టిపడేసింది.

లేత రంగు చుడిదార్ ధరించిన పూర్ణ పొద్దికైన అందాలతో ముద్దొచ్చేలా ఉన్నారు. చందమామ చుడిదార్ కట్టినట్లు ఉండగా, ముఖం వెన్నెల వలె మెరిసిపోతుంది. పూర్ణ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.
త్వరలో పూర్ణ పెళ్లిపీటలెక్కనుంది. కొద్దిరోజుల క్రితం ఆమె కాబోయేవాడిని పరిచయం చేసింది. షానిద్ అసిఫ్ అలీ వ్యక్తిని పూర్ణ పెళ్లి చేసుకోబుతుంది. చాలా మంది ఆమె స్క్రీన్ నేమ్ ఆధారంగా హిందువు అని భ్రమపడుతూ ఉంటారు. కానీ పూర్ణ ముస్లిమ్ అమ్మాయి. ఆమె అసలు పేరు షామ్నా ఖాసీం.
ఇక పూర్ణకు భర్త కానున్న షానిద్ బిజినెస్ మెన్ అని సమాచారం. అతని ప్రొఫైల్ ని బట్టి చూస్తే జేబిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ. ధనవంతుడైన వ్యాపారవేత్తను వివాహమాడి పూర్ణ లైఫ్ లో చక్కగా సెటిల్ కానుంది. నటిగా కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూర్ణకు మంచి లైఫ్ పార్టనర్ దొరికాడు. వీరిది ప్రేమ వివాహమా లేక అరేంజ్డ్ మ్యారేజా? అనేది తెలియదు.
ఇక కెరీర్ పరిశీలిస్తే కేరళకు చెందిన పూర్ణ మలయాళ చిత్రం మంజు పోలూరు పెన్కుట్టి చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం శ్రీమహాలక్ష్మి. ఆమెకు సీమటపాకాయ్ మూవీతో బ్రేక్ వచ్చింది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సీమ టపాకాయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
నటుడు, దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన హారర్ సిరీస్ అవును, అవును 2 చిత్రాల్లో పూర్ణ నటించారు. ఈ రెండు కూడా ఆమెకు గుర్తింపు తెచ్చాయి. అయితే తెలుగులో ఆమె హీరోయిన్ గా నిలబెట్టుకోలేకపోయారు. ఆమె కెరీర్ త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. ప్రస్తుతం పూర్ణకు హీరోయిన్ అవకాశాలు రావడం లేదు.
ఆమె వెబ్ మూవీ 3 రోజెస్ లో ఒక హీరోయిన్ గా పూర్ణ నటించారు. ఆహా లో విడుదలైన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా నటించారు. ఈ మూవీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. పూర్ణకు హీరోయిన్ అవకాశాలు దాదాపు మూసుకుపోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్స్ చేశారు.
ఆమె స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. అఖండ మూవీ ప్రభుత్వ అధికారిణి పాత్రలో మెప్పించిన పూర్ణ, దృశ్యం 2 మూవీలో లాయర్ గా ఆకట్టుకున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ పాత్రలకు ప్రశంసలు దక్కాయి.
కొన్నాళ్లుగా పూర్ణ బుల్లితెరపై సైతం అలరిస్తున్నారు. డాన్స్ రియాలిటీ షో ఢీ 13 జడ్జిగా ఆమె వ్యవహరించారు. హీరోయిన్ పూర్ణతో పాటు జడ్జి సీట్లో కూర్చొని ఎంటర్టైన్ చేశారు. మంచిగా పర్ఫార్మ్ చేసిన డాన్స్ కంటెస్టెంట్స్ బుగ్గలు కొరుకుతూ పూర్ణ సంచలనాలకు తెరలేపారు.
మొత్తంగా పూర్ణ కెరీర్ యావరేజ్ గా సాగుతుంది. ఇక పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా నటనకు దూరం కానుందట. నెలల వ్యవధిలో వివాహ వేడుక ఉండగా ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి కూడా సైన్ చేయకపోవచ్చు. ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ ని ఇది తీవ్రంగా నిరాశ పరిచే అంశమే అని చెప్పాలి.