- Home
- Entertainment
- చిన్న గౌను వేసుకొని కొండెక్కిన పవన్ హీరోయిన్... పిల్లగాలికి పైకి పోతుంటే ఇబ్బంది పడ్డ ప్రణీత!
చిన్న గౌను వేసుకొని కొండెక్కిన పవన్ హీరోయిన్... పిల్లగాలికి పైకి పోతుంటే ఇబ్బంది పడ్డ ప్రణీత!
హీరోయిన్ ప్రణీత సుభాష్ సమ్మర్ వెకేషన్ లో ఉన్నారనిపిస్తుంది. ఆమె హిల్ ఏరియాకు వెళ్లారు. వ్యూ పాయింట్ నుండి నేచర్ ఎంజాయ్ చేస్తున్న ప్రణీత ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Pranitha Subhash
చిన్న గౌను వేసుకున్న ప్రణీత కొండపైకి పోయారు. ప్రణీత లుక్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రణీత లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షార్ట్ ఫ్రాక్ లో ప్రణీత సూపర్ గ్లామరస్ గా ఉన్నారు.
Pranitha Subhash
కాగా ప్రణీత సుభాష్ పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తున్నారు. భర్త అనుమతితో సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. దర్శక నిర్మాతలను ఆకర్షించేందుకు గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ప్రణీత స్లిమ్ బాడీలో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
Pranitha Subhash
ప్రణీత 2021లో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. ఈ విషయాన్ని ప్రణీత రహస్యంగా ఉంచారు. అనంతరం ఈ మేటర్ లీక్ చేశారు. ఆ వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ప్రణీత తల్లి అయ్యారు. ఆమె పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. సోషల్ మీడియాలో కూతురు ఫోటోలు షేర్ చేస్తూ ఆమె మురిసిపోతున్నారు. అటు తల్లిగా ఇటు నటిగా రెండు బాధ్యతలు ప్రణీత నెరవేరుస్తున్నారు.
ప్రస్తుతం ఆమె రామన అవతార అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల మలయాళ నటుడు దిలీప్ కుమార్ కి జంటగా ఓ చిత్రానికి సైన్ చేశారు. టాలీవుడ్ లో మాత్రం ఆమె ఫేడ్ అవుట్ అయ్యారు. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ మూవీలో చిన్న క్యామియో రోల్ చేశారు.
ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ తో ప్రణీత జతకట్టారు. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఆ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ కి జంటగా రభస చిత్రం చేశారు. ఈ మూవీ నిరాశపరిచింది.
Pranitha Subhash
బాలీవుడ్ లో కూడా అదృష్టం పరీక్షించుకున్నారు ప్రణీత. వరుసగా రెండు హిందీ చిత్రాలు చేశారు. హంగామా 2, బుజ్ చిత్రాల్లో ప్రణీత హీరోయిన్ గా నటించారు. అక్కడ కూడా ఆమెకు కలిసి వచ్చినట్లు లేదు. ఆ రెండు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. దీంతో మరలా సౌత్ కి తిరిగొచ్చారు.
కోవిడ్ సమయంలో ప్రణీత తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదలకు అవసరమైన ఆహారం సొంత ఖర్చులతో అందించారు. ప్రణీత పేరెంట్స్ డాక్టర్స్ కాగా ఆ కోణంలో కూడా పలువురికి సహాయం చేసింది. ప్రణీత సేవాభావాన్ని పలువురు కొనియాడారు.