- Home
- Entertainment
- టైట్ బాడీ కాన్ డ్రెస్ లో ప్రగ్యా స్టన్నింగ్ లుక్... టెంపరేచర్ పెంచేస్తున్న బాలయ్య భామ!
టైట్ బాడీ కాన్ డ్రెస్ లో ప్రగ్యా స్టన్నింగ్ లుక్... టెంపరేచర్ పెంచేస్తున్న బాలయ్య భామ!
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో కిరాక్ పోజులిచ్చారు. ఆమె సూపర్ గ్లామరస్ లుక్ టెంప్ట్ చేసేలా ఉంది. ప్రగ్యా జైస్వాల్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Pragya Jaiswal
సిల్వర్ స్క్రీన్ పై ఆఫర్స్ తగ్గిపోగా ప్రగ్యా జైస్వాల్ మోడలింగ్ పై దృష్టి పెట్టారు. ఆమె వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. తాజాగా టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి సూపర్ హాట్ పోజుల్లో సెగలు రేపారు. ప్రగ్యా కిల్లింగ్ లుక్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది.
Pragya Jaiswal
అయితే ప్రగ్యా కెరీర్ ప్రమాదంలో పడింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. ఇతర పరిశ్రమల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వస్తున్న దాఖలాలు లేవు. టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యాకు కాలం కలిసి రాలేదు.
Pragya Jaiswal
ప్రగ్యా కెరీర్ లో ఫస్ట్ హిట్ మూవీ కంచె. పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కంచె మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది.ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి. కంచె అనంతరం ప్రగ్యా జైస్వాల్ వెలుగులోకి వచ్చింది.
Pragya Jaiswal
కంచె అనంతరం గుంటూరోడు మూవీలో నటించింది . మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.
Pragya Jaiswal
చాలా గ్యాప్ తర్వాత అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Pragya Jaiswal
చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి.