MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Save The Tigers 3 First Review: సేవ్‌ ది టైగర్స్ సీజన్‌ 3 ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?

Save The Tigers 3 First Review: సేవ్‌ ది టైగర్స్ సీజన్‌ 3 ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?

Save The Tigers 3 First Review: సేవ్‌ ది టైగర్స్ వెబ్‌ సిరీస్ లు విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా రన్‌ అవుతున్నాయి. ఇప్పుడు మూడో సీజన్‌ రాబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 16 2026, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ నెల 19న సేవ్‌ ది టైగర్స్ 3 స్ట్రీమింగ్‌
Image Credit : Asianet News

ఈ నెల 19న సేవ్‌ ది టైగర్స్ 3 స్ట్రీమింగ్‌

`సేవ్‌ ది టైగర్స్` వెబ్‌ సిరీస్‌ ఇప్పటి రెండు సీజన్లు విజయవంతంగా రన్‌ అయ్యింది. ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌ నుంచి మూడో సీజన్‌ వచ్చింది. `సేవ్‌ ది టైగర్స్ 3` పేరుతో దీన్ని రూపొందించారు దర్శకుడు మహి వీ రాఘవ్‌, ప్రదీప్‌ అద్వైతం. దీనికి శ్రీరామ్‌ ఎరగం దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, చైతన్య కృష్ణ, జోర్దార్‌ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిశోర్‌, రోహిణి, గుండు సుదర్శన్‌, అవినాష్‌, అభయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూడో సీజన్‌ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ట్రైలర్‌తో ఆకట్టుకున్న సేవ్‌ ది టైగర్స్ 3
Image Credit : Asianet News

ట్రైలర్‌తో ఆకట్టుకున్న సేవ్‌ ది టైగర్స్ 3

ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. భార్యలతో భర్తలు పడే ఇబ్బందులు, ఈ క్రమంలో వివిధ తప్పులు చేయడం, పోలీస్‌ కేసులు ఇవన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అదే సమయంలో నవ్వులు పూయించేలా ఉంది. అయితే ఇందులో రెండు ప్రపంచాలు అనేది కొత్తగా ఉంది. ఇదే వెబ్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ని సెలబ్రిటీలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది.  ఈ సిరీస్‌  ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. 

Related Articles

Related image1
Folk Song: 135 మిలియన్లతో యూట్యూబ్‌ దుమ్ముదులిపేస్తున్న ఫోక్‌ సాంగ్‌.. వింటే మీ మూడ్‌ సెట్‌
Related image2
Mahesh Next Film: మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్, బాక్సాఫీసు వద్ద అరాచకమే.. `పెద్ది` డైరెక్టర్‌ కాదు
34
సేవ్‌ ది టైగర్స్ 3 ఫస్ట్ రివ్యూ
Image Credit : Asianet News

సేవ్‌ ది టైగర్స్ 3 ఫస్ట్ రివ్యూ

సెలబ్రిటీలు ఈ సిరీస్‌ని ఎంజాయ్‌ చేసినట్టు చెబుతున్నారు. చాలా వరకు పాజిటివ్‌ రియాక్షన్ వచ్చింది. గత రెండు సీజన్లతో పోల్చితే ఇందులో ఓ కొత్త పాయింట్‌ ఉందట. రెండు ప్రపంచాలుంటాయట. అదే ఎంగేజింగ్‌, ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్టర్‌ అంటున్నారు. అందులో కన్‌ప్యూజ్డ్ కామెడీ ఆకట్టుకుంటుందని, నవ్వించేలా ఉంటుందని చెబుతున్నారు. వీరి జీవితంలోకి ఇంద్రుడు కూడా వస్తాడట. అది మరింత ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.  ఫస్ట్ రెండు మూడు ఎపిసోడ్లు కాజువల్‌గానే సాగుతాయని, మూడో సీజన్‌ తర్వాత నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. నాలుగు, ఐదు సీజన్లు హిలేరియస్‌గా ఉంటాయట. చివరి సిరీస్‌ ఎమోషనల్‌గా ఉంటుందని అంటున్నారు.

44
సేవ్‌ ది టైగర్స్ 3 లో అదిరిపోయే ట్విస్ట్.. మైనస్‌ ఏంటంటే
Image Credit : Asianet News

సేవ్‌ ది టైగర్స్ 3 లో అదిరిపోయే ట్విస్ట్.. మైనస్‌ ఏంటంటే

దీంతోపాటు మెయిన్‌ క్యారెక్టర్స్ కి సంబంధించిన మరో ట్విస్ట్ ఉంటుందట. అది అస్సలు ఊహించలేరని చెబుతున్నారు. ప్రారంభంలోనే ఆయా సీన్‌ వస్తుందని, ఆ తర్వాత నాల్గో సీజన్‌ నుంచి దాని చుట్టూనే కథ నడుస్తుందని సమాచారం. మొత్తంగా నవ్విస్తూ, ఆలోచింప చేస్తూ, ఎమోషనల్‌కి గురి చేస్తుందట.  అయితే కామెడీ ఫస్ట్ నుంచి అంతగా వర్కౌట్‌ కాలేదని, లైటర్‌వేలోనే ఉందని చెబుతున్నారు. కొంత ల్యాగ్‌, మరికొంత కన్‌ఫ్యూజ్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఓవరాల్‌గా మాత్రం ఎంజాయ్‌ చేసేలా ఈ సిరీస్‌ ఉంటుందని సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా ఇది ఎలా ఉంది, గత రెండు సీజన్లని మించి నవ్వించిందా లేదా? సర్‌ప్రైజ్‌ చేసిందా లేదా అనేది మరో మూడు రోజుల్లో తేలనుందని చెప్పొచ్చు. ఏసియానెట్‌ రివ్యూ కోసం వెయిట్‌ చేయండి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image2
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Recommended image3
Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Related Stories
Recommended image1
Folk Song: 135 మిలియన్లతో యూట్యూబ్‌ దుమ్ముదులిపేస్తున్న ఫోక్‌ సాంగ్‌.. వింటే మీ మూడ్‌ సెట్‌
Recommended image2
Mahesh Next Film: మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్, బాక్సాఫీసు వద్ద అరాచకమే.. `పెద్ది` డైరెక్టర్‌ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved