MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజకీయాల్లో కామెడీ సినిమాల్లో సీరియస్నెస్... పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పూనమ్ కౌర్ సెటైరికల్ ట్వీట్!

రాజకీయాల్లో కామెడీ సినిమాల్లో సీరియస్నెస్... పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పూనమ్ కౌర్ సెటైరికల్ ట్వీట్!

రాజకీయాల్లో కామెడీ సినిమాల్లో సీరియస్నెస్... పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పూనమ్ కౌర్ సెటైరికల్ ట్వీట్!

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 02 2023, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పూనమ్ కౌర్ టాలీవుడ్ ఫైర్ బ్రాండ్. నటిగా కంటే వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయ్యారు. తరచుగా ఈమె సోషల్ మీడియా పోస్ట్స్ తో కాకరేపుతుంటారు. పూనమ్ కౌర్ పోస్ట్స్ ఓ ఇద్దరు స్టార్స్ ని పరోక్షంగా టార్గెట్ చేసినట్లు ఉంటాయి. అవి ఒకరు హీరో పవన్ కళ్యాణ్ మరొకరు దర్శకుడు త్రివిక్రమ్. వీలు దొరికినప్పుడా వీరిపై విరుచుకుపడుతుంటుంది.  

26


పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పై ఇండైరెక్ట్ గా ఆమె సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే ఏనాడూ నేరుగా ఓపెన్ అయ్యింది లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై సెటైర్ వేసింది. బ్రో మూవీలోని శ్యామ్ బాబు పాత్ర వివాదం రాజేసిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రి అంబటి రాంబాబును కించపరిచేందుకే ఆ పాత్ర పెట్టారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. 
 

36

దీనిపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు కొందరికి వార్నింగ్ ఇచ్చారు. రాజకీయంగా ఏం చేయలేని పవన్ కళ్యాణ్ సినిమాల్లో పాత్రలు పెట్టి కసి తీర్చుకుంటున్నాడని ఎద్దేవా చేశాడు. ఇది కొనసాగితే గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. మీరు మూల్యం చెల్లిస్తారని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. త్రివిక్రమ్ పేరు నేరుగా పలికారు.

46
Poonam Kaur

Poonam Kaur

ఈ వివాదం నేపథ్యంలో పూనమ్ కౌర్... 'రాజకీయాల్లో వినోదం ఎక్కువైంది. సినిమాల్లోనేమో సీరియస్నెస్ ఎక్కువైంది' అని ట్వీట్ చేశారు. సీరియస్నెస్ ఉండాల్సిన రాజకీయాలు ఎంటర్టైన్మెంట్ కి వేదికైతే... ఎంటర్టైన్ చేయాల్సిన సినిమాలు మాత్రం సీరియస్ గొడవలకు దారి తీస్తున్నాయని ఆమె పరోక్షంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వినోదం పంచుతూ, సినిమాలతో వివాదాలు రాజేస్తున్నాడని ఆమె భావన కావచ్చని నెటిజెన్స్ అభిప్రాయం. 
 

56
Poonam Kaur

Poonam Kaur

ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ ఆమె మీద విరుచుకుపడుతున్నారు. కామెంట్స్ సెక్షన్ లో పూనమ్ కౌర్ ని దూషిస్తున్నారు. ఇటీవల కూడా ఆమె పవన్ టార్గెట్ గా కొన్ని సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టింది. గురు పౌర్ణమి సందర్భంగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ ని గురు అని సంబోధిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. నా గురు లక్ష్యం నెరవరాలన్నారు. ఇకపై ఆయన ఫేమ్, నేమ్ వాడుకొని ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయను అన్నారు. సీఎం కావాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ గురు అని పిలిచిన నేపథ్యంలో పూనమ్ కౌర్ ఫైర్ అయ్యారు.

66

పూనమ్ కౌర్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో... ప్రతి అడ్డమైనవాడిని గురు అని పిలవకండి. వేదికల మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు. దారి చూపించేవాడు గురు అవుతాడు. దయచేసి అర్థం చేసుకోండి, అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించే అని నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhooth Bangla: ఈ ఏడుగురు స్టార్స్ లో బాగా చదువుకుంది ఎవరో తెలుసా ? వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవే
Recommended image2
Tabu Real Name: టబు అసలు పేరేంటి? తండ్రి ఇంటిపేరు ఎందుకు వాడరు? ఆయనంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఇదే
Recommended image3
Nayanthara Controversies: నయనతారతో కలిసి అల్లు అర్జున్ జీవితంలో నటించడా.. ఒకటా రెండా లెక్కలేనన్ని వివాదాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved