అలా చేయాలనుకుంటే నాకు కారు కొనివ్వండి: పూజా హెగ్డే
తనపై వచ్చే రూమర్స్ ని ఉద్దేశిస్తూ పూజా హెగ్డే కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి.

స్టార్ లేడీ పూజా హెగ్డే తరచుగా ఎఫైర్ రూమర్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. హీరో సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే డేటింగ్ చేస్తున్నారని ఓ ప్రచారం ఉంది. దీన్ని పూజా హెగ్డే ఖండించారు. తాజాగా ఆమెకు ఓ నిర్మాత కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చాడట. ఈ వార్తలపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. నాపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. వీటన్నింటికీ సమాధానాలు ఇస్తూ కూర్చోలేను. కొన్ని సందర్భాల్లో నా పేరెంట్స్ ఈ పుకార్లు నిజమే అని నమ్ముతుంటారు.
ఓ నిర్మాత నాకు ఖరీదైన కారు కొనిచ్చారని ప్రచారం చేస్తున్నారు. నా గురించి తప్పుగా ప్రచారం చేయాలి అనుకుంటే మీరే ఆ కారు కొనివ్వండి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. ఆమె లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న పూజా హెగ్డే ఏ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
Pooja Hegde
గత ఏడాది ఆమెకు వరుస షాకులు తగిలాయి. ఒకదానికి మించిన మరో డిజాస్టర్ పూజా ఖాతాలో చేరాయి. రాధే శ్యామ్ మూవీతో ఆమె సక్సెస్ గ్రాఫ్ పడుతూ వచ్చింది. నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్లో భారీ నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. వందల కోట్ల నష్టం రాధే శ్యామ్ మిగిల్చింది.
రాధే శ్యామ్ ఫెయిల్యూర్ నుండి బయటపడే లోపే మరో డిజాస్టర్ పలకరించింది. రాధే శ్యామ్ కి మించిన పరాజయం ఆచార్య చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ రెండో రోజే థియేటర్స్ నుండి ఎత్తేస్తారు. ఏప్రిల్ లో విడుదలైన ఆచార్య పూజాకు ఊహించని షాక్ ఇచ్చింది.రాధే శ్యామ్, ఆచార్య చిత్రాల మధ్యలో ఆమెకు మరో ప్లాప్ పడింది. విజయ్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. రాధే శ్యామ్, ఆచార్యలతో పోల్చుకుంటే నష్టాలు తక్కువే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన ప్లాప్ మూవీగా బీస్ట్ రికార్డులకు ఎక్కింది.
Pooja Hegde
బాలీవుడ్ చిత్రం సర్కస్ వీటన్నింటినీ మించిన డిజాస్టర్ అయ్యింది. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కస్ వరస్ట్ ఫిల్మ్ గా ప్రేక్షకులు అభివర్ణించారు. ఈ క్రమంలో 2023 పూజాకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. మరోవైపు పూజా ఎస్ఎస్ఎంబి 28 షూట్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.