- Home
- Entertainment
- నాకు పెళ్లైంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఈయనే మా ఆయన.. బాంబు పేల్చిన నివేదా థామస్!
నాకు పెళ్లైంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఈయనే మా ఆయన.. బాంబు పేల్చిన నివేదా థామస్!
మలయాళ భామ నివేద థామస్ నాకు పెళ్లి అయ్యిందని చెప్పి షాక్ ఇచ్చింది. తన భర్త, ఇద్దరు పిల్లలను పరిచయం చేసింది. ఆమె చర్యలకు అభిమానులు ఖంగుతిన్నారు. ఇంతకీ నివేద థామస్ భర్త ఎవరో చూద్దాం..

Nivetha Thomas
చైల్డ్ ఆర్టిస్ట్ గా నివేద థామస్ కెరీర్ మొదలైంది. 2011లో విడుదలైన మలయాళ చిత్రం 'చెప్ప కురిష్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం జెంటిల్ మన్. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. నాని డ్యూయల్ రోల్ చేసిన జెంటిల్ మన్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Nivetha Thomas
రెండో చిత్రం కూడా నానితో చేసింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ నిన్ను కోరి తో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. దాంతో తెలుగులో నివేదకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. దర్శకుడు బాబీ తెరకెక్కించిన జై లవకుశ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నివేద థామస్ చేయడం విశేషం. వరుసగా మూడు హిట్స్ నమోదు చేసింది.
Nivetha Thomas
నివేద థామస్ కెరీర్లో చెప్పుకోదగ్గ విజయాలే ఉన్నాయి. అయినా ఆమె స్టార్ కాలేకపోయింది. బ్రోచేవారెవరురా, వకీల్ సాబ్ చిత్రాల్లో నివేద నటించిన సంగతి తెలిసిందే. రెజీనా కాసాండ్రా-నివేద థామస్ ప్రధాన పాత్రల్లో శాకినీ ఢాకీనీ టైటిల్ తో ఓ చిత్రం విడుదలైంది. ఈ మధ్య నివేద థామస్ కి ఆఫర్స్ తగ్గాయి.
Nivetha Thomas
ఆమె బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యారు. అసలే పొట్టిగా ఉండే నివేద లావు కావడంతో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. కాగా నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి నివేద థామస్ షాక్ ఇచ్చింది. నిజంగా నివేదకు పెళ్లైందా? అని ఫ్యాన్స్ అవాక్కు అయ్యారు. అయితే నివేదకు పెళ్లైంది నిజ జీవితంలో కాదు, సినిమాలో.
Nivetha Thomas
ఆమె నటించిన లేటెస్ట్ మూవీ '35-చిన్న కథ కాదు'. ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్న నివేద మాట్లాడుతూ... నా పెళ్లి వార్తలు చూసి మా అమ్మ ఆశ్చర్యపోతుంది. నాకు తెలియకుండా నీకు పెళ్లి ఎప్పుడైంది? అబ్బాయిని ఎవరు చూశారు? అంటుంది. అవును నాకు పెళ్లైంది... ఇతనే నా భర్త, వీళ్ళు నా ఇద్దరు పిల్లలు అని వేదిక మీదున్న వారిని చూపించింది.
Nivetha Thomas
35 చిత్రంలో నివేద పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న గృహిణి పాత్ర చేస్తుంది. ఆ చిత్రంలో తనకు భర్తగా, పిల్లలుగా నటించిన వారిని నివేద, ఆ విధంగా పరిచయం చేసింది. నిజంగా నివేదకు పెళ్లి కాలేదు. 35 చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా ప్రజెంట్ చేస్తున్నారు. ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రలు చేశారు. నంద కిషోర్ దర్శకత్వం వహించిన 35 చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది..