నెటిజన్లకు నివేదా పేతురాస్ విన్నపం..ఇబ్బందుల్లో ఉన్నాం.. అలా చేయకండంటూ...
ప్రస్తుతం నా పరిస్థితి ఏం బాగోలేదు.. ఫ్యామిలీ కూడా ఇబ్బందిపడుతుంది. దయచేసి అలా చేయకండి... అంటూ నెటిజన్లకు విన్నపం చేసుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్. ఇంతకీ ఆమె ఏంమంటుందంటే..?

Nivetha Pethuraj
తమిళ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్.. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. తెలుగులో శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో సినిమాతో పరిచయమైంది. ఈసినిమా తరువాత బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంలో, పాగల్, రెడ్, దాస్ కా ధమ్కీ.. ఇలా పెద్ద సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ.
మల్టీ టాలెంట్ కలిగిన నివేద పేతురాజ్ హీరోయిన్ గా మాత్రమే కాదు.. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా వెనకాడటం లేదు నివేద. ఇక ఆమె నటి మాత్రమే కాదు, రేసర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. కాగా ఈమధ్య ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు. పైగా కోలీవుడ్ లో ట్రోల్స్ ను ఫేస్ చేస్తోంది నివేదా పేతురాజ్.
రీసెంట్ గా తమిళ మీడియాలో కొంతమంది నివేదా పేతురాజ్ పై నెగిటివ్ గా వార్తలు స్పెర్డ్ చేశారు. నివేదా పేతురాజ్ పై కొంతమంది డబ్బులు ఖర్చుపెడుతున్నారని అభ్యంతకర వార్తలు రాశారు. దీంతో నివేదా పేతురాజ్ అలాంటి వార్తలపై తన సోషల్ మీడియాలో సీరియస్ గా స్పందించింది. ఒక రకంగా అలా రాసేవారిపై ఫైర్ అయింది.
నివేదా పేతురాజ్ తన ట్వీట్ లో.. ఇటీవల నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తప్పుడు వార్తలు రాసారు. మొదట నేను మౌనంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవాళ్ళు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేముందు వాళ్ళు విన్న సమాచారం నిజమా కాదా అని ధృవీకరించడానికి మానవత్వం ఉంటుందని అనుకున్నాను. కాని అది లేదని ఇప్పుడు నిరూపణ అయ్యింది అంటూ మండిపడింది.
ఈ వార్తలతో కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు రాసే ముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల నుండే సంపాదించడం మొదలుపెట్టాను. నా ఫ్యామిలీ ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంటుంది. 20 ఏళ్లకు పైగా మేము దుబాయ్‌లోనే ఉన్నాము.
అంతే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు ఛాన్స్ ఇవ్వమని ఏ రోజు ఏ నిర్మాతను, డైరెక్టర్ ని, హీరోని అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను, అవన్నీ నా దగ్గరికి వచ్చిన అవకాశాలే. నేను డబ్బు కోసం అత్యాశ పడను. నా గురించి వచ్చిన వార్తలు అన్ని అబద్దాలే. మేము 2002 నుండి దుబాయ్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాము అన్నారు.
ఇక అందరితో పోలిస్తే.. నేను చాలా సాధారణ లైఫ్ గడుపుతాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే నేను ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఆడవాళ్లు కోరుకున్నట్టే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను.క నన్ను అనేముందు మీ ఇంట్లో వాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా.. అని తన ఆవేధనను వెల్లడించారు నివేద. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది.