ఆ పార్ట్ కు సర్జరీ చేయమంటే.. డాక్టర్ చంపేస్తా అన్నాడు.. నివేదా పేతురాజ్ సంచలన వ్యాఖ్యలు..
సౌత్ స్టార్ హీరోయిన్ నివేదా పేతురాజ్.. ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకోవాలని కోరిక బాగా ఉండేదట. కాని డాక్టర్ ఇచ్చిన షాక్ తో ఆమె వేనకడుగు వేసిందట. ఇంతకీ నివేద ఏం చేయాలనుకుంది.. డాక్టర్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?
తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసింది హీరోయిన్ నివేదా పేతురాజ్. అచ్చమైన అరవ అమ్మాయి నివేదా. కాని తమిళనాట ఎక్కువగా రాణించలేకపోయింది. తమిళనాడులో పుట్టి తమిళం బాగా మాట్లాడేవారికి తెలుగు మాదిరి అవకాశాలు ఇవ్వడంలేదనే విమర్శ ఉంది. ఈ విషయంలో బెస్ట్ ఎక్జాంపుల్ నివేదా పేతురాజ్. మదురైలో పుట్టిపెరిగిన ఆమె తమిళ సినిమాల ద్వారా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ లో ఉదయనిధి స్టాలిన్, జయం రవి, విజయ్ ఆంటోని,విజయ్ సేతుపతి లాంటి హీరోల సరసన మెరిసింది బ్యూటీ.
రజినీకాంత్ కూతురితో జయం రవి పెళ్ళి..? కొత్త బాంబ్ పేల్చిన సెలబ్రిటీ..
ఆతరువాత తమిళంలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. కోలీవుడ్ ను అందింపుచ్చుకుంది బ్యూటీ. తెలుగులో వరుసగా అవకాశాలు.. వరుసగా విజయాలు ఆమెను వరించాయి. టాలీవుడ్ లో అల్లు అర్జున్‌తో అలవైకుంఠపురములు, రెడ్ వంటి వరుస హిట్‌లను అందించిన నివేదా పేతురాజ్ టాలీవుడ్‌లో పాపులర్ నటిగా మారింది. కాని ఇక్కడ కూడా ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో వెబ్ సిరీస్ ల వైపు మళ్లింది బ్యూటీ.
nivetha Pethuraj
రీసెంట్ గా పరుపు అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది నివేదా పేతురాజ్. ఈ సిరిస్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే తెలుగులో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కోసం ప్రమోషన్‌లో జోరుగా పాల్గొంది నివేదా. ఇక ఇందులో భాగంగా నివేదా పేతురాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఇది సినిమా ప్రమోషన్ కోసంమని తర్వాత తెలిసి అంతా షాక్ అయ్యారు కూడా.
ఈక్రమంలో పరుపు వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చిన నివేదా.. ఓ సందర్భంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. మరీముఖ్యంగా తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నట్టు తన కోరిక గురించి కూడా మాట్లాడాడు. ఇంతకీ నివేదా ఈవిషయంలో ఏం కామెంట్స్ చేశారంటే..?
పెళ్ళై వారం కాలేదు.. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అయింది..? హాస్పిటల్ లో కనిపించిన కొత్త జంట..?
నివేదా మాట్లాడుతూ.. "నాకు ప్లం లిప్స్ అంటే చాలా ఇష్టం.. నా పెదాలు కూడా అలా మార్చుకోవాలని ప్రయత్నం చేశారు. దాని కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకున్నాను. ఈ విషయం మా ఫ్యామిలీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాను.. ఇంజెక్షన్ తీసుకుంటావా అని అడిగారు. సరే అన్నాను.. అయితే నిన్ను చంపేస్తాను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అని డాక్టర్ సరదాగా బెదిరించాడు. ఇలాంటివి మంచిది కాదని.. ఫ్యూచర్ లో చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
కాని ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోయిన్లు ముఖాలు మార్చుకుని.. రకరకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. కాని నన్ను అడిగితే ఇది మంచిది కాదు అనే చెపుతాను.. ఇలా సర్జరీ చేయించుకోకుండానే స్టార్ డమ్ ను చూసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. సాయి పల్లవి, నిత్యమీనన్ లాంటివారు ఏం సర్జరీలు చేయించుకోలేదు కదా..? అసలు వారుమేకప్ నే సరిగ్గా ఇస్టపడరు. అయినా వారు అందంగా ఉన్నారు కదా అని అన్నారు నివేదా పేతురాజ్ .