MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ స్టార్ హీరో వేధించాడన్న నిత్యామీనన్... అంతలోనే భారీ ట్విస్ట్!

ఆ స్టార్ హీరో వేధించాడన్న నిత్యామీనన్... అంతలోనే భారీ ట్విస్ట్!

ఓ హీరో వేధింపులకు గురి చేశాడని నిత్యా మీనన్ కామెంట్స్ చేశారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె కామెంట్స్ పై స్పష్టత వచ్చింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 26 2023, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


నిత్యా మీనన్ ఓ తమిళ హీరో వేధించాడని అన్నారట. అతని కారణంగా కోలీవుడ్ లో అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పారని సదరు కథనాల సారాంశం. ఒక్కసారిగా ఈ న్యూస్ కోలీవుడ్ లో సంచలనం రేపింది. సదరు హీరో ఎవరై ఉండొచ్చనే సందిగ్ధత మొదలైంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అని కొందరు తెలుకునే ప్రయత్నం చేశారు. 

26

తమిళ హీరో వలన వేధింపులకు గురయ్యానని నిత్యా మీనన్ చెప్పినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఆమె స్వయంగా ఈ పుకార్లను ఖండించారు. అలాంటి కామెంట్స్ నేను చేయలేదు. ఇవన్నీ నిరాధార కథనాలని ఆమె కొట్టిపారేశారట. నిత్యా మీనన్ తో చాట్ చేసిన ఓ జర్నలిస్ట్ ఆమె ఈ విషయం వెల్లడించారు. దీంతో ఓ చర్చకు తెరపడింది. నిత్యా మీనన్ మీద పుకార్లు కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేకమార్లు ఆమె పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. 

 

36

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోతో నిత్యా మీనన్ వివాహం అంటూ ఓ పుకారు తెరపైకి వచ్చింది. సదరు హీరో నిత్యా మీనన్ కి చిన్ననాటి మిత్రుడని. ఇరు కుటుంబాల మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై నిత్యా మీనన్ స్పదించలేదు. 

46

ప్రస్తుతం ఆమె కుమారి శ్రీమతి టైటిల్ తో వెబ్ సిరీస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28 నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఓ భిన్నమైన పాత్రలో ఆమె అలరించనున్నారు. మాసూద ఫేమ్ తిరువీర్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. గోమ్తేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 

56

ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన నిత్యా మీనన్ 7 ఓ క్లాక్ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ అయ్యారు. తెలుగులో ఆమె మొదటి సినిమా అలా మొదలైంది. 2011లో విడుదలైన అలా మొదలైంది సూపర్ హిట్ అందుకుంది. నితిన్ కి జంటగా నటించిన ఇష్క్ నిత్యా మీనన్ కి మరింత ఫేమ్ తెచ్చింది. 

 

66

తెలుగులో ఆమె చివరి చిత్రం భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్ భార్య పాత్ర చేసింది. భీమ్లా నాయక్ లో నిత్యా మీనన్ పాత్ర ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓ మలయాళ చిత్రం చేస్తుంది. నిత్యా మీనన్ మంచి సింగర్ కూడాను. పలు చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved