- Home
- Entertainment
- తల్లికాబోతున్న హీరోయిన్ నమితా.. తొలిసారి బేబీ బంప్ చూపిస్తూ ప్రెగ్నెన్సీ అనౌన్స్.. పిక్స్ వైరల్..
తల్లికాబోతున్న హీరోయిన్ నమితా.. తొలిసారి బేబీ బంప్ చూపిస్తూ ప్రెగ్నెన్సీ అనౌన్స్.. పిక్స్ వైరల్..
గతంలో అందం, అభినయంతో కుర్రాళ్లను ఆకట్టుకున్న హీరోయిన్లలో నమితా (Namitha) ఒకరు. ఇటీవల సినిమాల జోరు తగ్గించినా అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. ఈ సందర్భంగా తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. తన ప్రెగ్నెన్సీని తెలియజేస్తూ బెబీ బంప్ పిక్స్ ను షేర్ చేసుకుంది.

టాలీవుడ్ ను ఒకప్పుడు ఊపూపిన హీరోయిన్లు ఒక్కక్కరుగా పెళ్లి చేసుకొని, పండంటి బిడ్డకు జన్మనిస్తూ తమ జీవితాల్లో ముందడుగు వేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ కాజల్ అగర్వాల్ మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
గత నెలలో హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha) కూడా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ తొలిసారి బేబీబంప్ ను చూపించింది. అయితే తాజాగా టాలీవుడ్ కు చెందిన మరో హీరోయిన్ నమితా (Namitha) కూడా తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది.
ఈ మేరకు ప్రత్యేకంగా ఫొటోషూట్ నిర్వహించింది. ఆ ఫొటోలను తన అభిమానులతో ఇన్ స్టా ద్వారా పంచుకుంది. బ్లాక్ వేర్ లో నమితా బెబీ బంప్ ను చూపిస్తూ మురిసిపోయింది. ఈ పిక్స్ షేర్ చేసుకుంటూ సుధీర్ఘమైన నోట్ కూడా రాసింది.
‘మాతృత్వం ఒక కొత్త అధ్యాయం. ఈ దశలో నేను చాలా సున్నితంగా మారిపోయాను. నాపై ప్రకాశవంతమైన సూర్యరశ్మి పడుతుడటంతో నాలో చాలా మార్పులు కలిగాయి. దీనికోసమే చాలా కాలం ప్రార్థించాను. నా బేబీ సున్నితంగా పొట్టను తన్నుతూ ఉండటాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. ఈ అనుభవం మరేప్పుడు కలగనిది’ అంటూ రాసుకొచ్చింది.
గుజరాత్ కు చెందిన నమితా 2001 నుంచి తన కేరీర్ ను ప్రారంభించింది. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ సుందరి. 2017 నవంబర్ లో చెన్నైకి చెందిన తెలుగు వ్యక్తి అయిన తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని తిరుమల తిరుపతి దేవస్థానంలో పెళ్లి చేసుకుంది.
ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులను దగ్గరగానే ఉంటోంది. ఫొటోషూట్లు, తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకుంటూ వస్తోంది. తాజాగా 41 ఏండ్లలో తను తల్లికాబోతున్నట్టు ప్రకటించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ‘సొంతం, జెమిని, నాయకుడు, బిల్లా, సింహ’ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి.