రోజు రోజుకు చిన్నపిల్లై పోతున్న హీరోయిన్ లయ... ఫ్రాక్ లో కిరాక్ ఫోజులు!
హీరోయిన్ లయ గ్లామర్ వయసు పెరుగేకుంది మరింత ఎక్కువవుతుంది. ఇంకా కాలేజ్ గర్ల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తుంది. లయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Laya Gorty
హీరోయిన్ లయ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ మిస్ పెగెంట్ 2023 కంపిటీషన్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విజేతలను అభినందించారు. ఈ ఈవెంట్ కోసం లాంగ్ ఫ్రాక్ ధరించిన లయ మెస్మరైజ్ చేశారు. ఆమె లుక్ కాలేజ్ గర్ల్ ని తలపిస్తుంది. నాలుగు పదుల వయసు దాటిన లయ సౌందర్యం అబ్బురపరుస్తుంది.
Laya Gorty
విజయవాడకు చెందిన లయ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. 1992లో విడుదలైన భద్రం కొడుకో మూవీలో లయ లీడ్ రోల్ చేశారు. ఆ మూవీ స్ట్రీట్ చైల్డ్స్ పై తీసిన చిత్రం. హీరోయిన్ గా లయ మొదటి చిత్రం స్వయంవరం. హీరో వేణు తొట్టెంపూడి కూడా హీరోగా పరిచయమయ్యాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్వయం వరం మంచి విజయాన్ని సాధించించింది. ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది.
Laya Gorty
తెలుగులో లయకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ముఖ్యంగా టైర్ టూ హీరోల ఛాయిస్ గా మారారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న లయకు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కాయి. ప్రేమించు ఈ తరహా చిత్రమే. ప్రేమించు మూవీలో లయదే ప్రధాన పాత్ర. సాయి కిరణ్ హీరో.
Laya Gorty
సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేమించు లో లయ అంధురాలు పాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్, నువ్వులేక నేనులేను వంటి కమర్షియల్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉంది కొద్ది రోజులే అయినా 50 కి పైగా చిత్రాల్లో లయ నటించారు.