విరహవేదనతో రగిలిపోతున్న బేబమ్మ.. కురుల మెరుపులతో కేరింతలు కొడుతున్న కృతీశెట్టి
ఈ మధ్య కాస్త వెనకబడింది కృతీ శెట్టి. వరుస హిట్లతో ఊపు ఊపేసిన బేబమ్మకు... కంటీన్యూస్ గా ఫెయిల్యూర్స్ దెబ్బలు తప్పడంలేదు. దాంతో ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ అవుతుంది బ్యూటీ.

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండదు కృతీ శెట్టి. అప్పుడప్పుడు అలా పలుకరించి వెళ్తుంది కాని... కంటీన్యూగా ఫోటో షూట్ లు చేయడంలేదు స్టార్ హీరోయిన్లు కూడా వరుసగా తమ హాట్ హాట్ అందాలు ఇన్ స్టాలో ఆరబోస్తుంటే.. కృతి మాత్రం వారానికి ఒక ఫోటో షూట్ చేయడమే కష్టంగా మారింది.

ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడంతోనే వరుసగా మూడు హిట్లు కొట్టింది కృతి శెట్టి. హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈబ్యూటీకి ఇక కెరీర్ లో తిరుగు ఉండదు అనుకునే లోపే..హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ను కూడా చూసింది బ్యూటీ. కథల ఎంపికలో తేడానో.. లేక.. సినిమాలు ఎంపికలో తొందరపడుతుందో తెలియదు కాని.. వరుసగా ప్లాప్ లు మూటగట్టుకుంటుంది బ్యూటీ..
రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన కృతీ కోసం స్టార్ హీరోలు సైతం పోటీ పడ్డారు. కాని ఇప్పుడు మాత్రం ఆమె చేతిలో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. శ్రీలీల పేరు వినిపిస్తుంది కాని.. కృతీ పేరు పెద్దగా వినిపించడంలేదు. దాంతో సోషల్ మీడియాలో లో తన అందంతో అద్భుతం చేయాలని చూస్తోంది. అలా అయినా అవకాశాలు సాధించాలి అనుకుంటున్నట్టుుంది.
రీసెంట్ గా తన ఫోటో షూట్ తో కుర్రాళ్లను కదిలించే ప్రయత్నం చేసింది బేబమ్మ.. కురులతో మెరుపులుమెరిపించింది. విరహవేదనతో రగిలిపోతూ.. మత్తు గమ్మత్తుచేసే ప్రయత్నం చేసింది. పొట్టి గౌనులో అందాలు ఆరబోస్తూ సందడి చేసింది బ్యూటీ. ఇన్ స్టాలో కృతీ ఫోటో షూట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి హిట్ సినిమాలు చేసిన ఈ బ్యూటీకి వారియర్ సినిమాతో పెద్ద దెబ్బ తగిలింది. కుర్రకారు మనసులను ఒక రేంజ్ లో దోచేసిన కృతి శెట్టి .. అంతే స్పీడ్ తో మూడు ఫ్లాపులు కూడా మూటగట్టేసింది. ఇక అప్పటి నుంచి ఆమె కొత్త ప్రాజెక్టులలో పెద్దగా కనిపించడం లేదు.
చైతూ జోడీగా చేస్తున్న కస్టడీ తప్ప మరో సినిమాలో ఆమె ఉన్నట్టు సూచనలే లేవు. గతంలో మాదిరిగా కృతి గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. రాబోయే సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వెళ్తుననట్టు కూడా కనిపించడంలేదు. దాంతో కృతి శెట్టి జోరు తగ్గినట్టే అంటున్నారు సినిమా పండితులు.
ఇప్పటికైనా సినిమాల విషయంతో కాస్త జాగ్రత్తగా వ్యావహరించాలని కోరకుంటున్నారు కృతీ ఫ్యాన్స్. లేకుంటే టాలీవుడ్ లో ఆమె కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.