- Home
- Entertainment
- ఎల్లో స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ముద్దబంతిలా యంగ్ బ్యూటీ కృతి శెట్టి... తాజా అందాలతో మనసులు దోచేసింది!
ఎల్లో స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ముద్దబంతిలా యంగ్ బ్యూటీ కృతి శెట్టి... తాజా అందాలతో మనసులు దోచేసింది!
కన్నడ భామ కృతి టైం మాములుగా లేదు. ఆమె వరుస చిత్రాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. ఉప్పెన ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేయగా... టాలీవుడ్ లో సెటిలైపోయింది.

Krithi Shetty
ఓ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడానికి పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ప్రదక్షిణలు చేస్తారు. కృతి శెట్టి (Krithi Shetty)లాంటి అమ్మాయిలు మాత్రం ఒక్క సినిమాతో పాప్యులర్ అవుతారు. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఉప్పెన కృతి శెట్టికి యూత్ లో భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది.
Krithi Shetty
ఇక రెండవ చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ గా నిలిచాయి. దీంతో డెబ్యూతో హ్యాట్రిక్ ఇచ్చిన హీరోయిన్ గా రికార్డులకు ఎక్కారు. వరుస హిట్స్ ఆమెకు లక్కీ హీరోయిన్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. దీంతో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కృతి లేటెస్ట్ మూవీ ది వారియర్ విడుదలకు సిద్ధమైంది.
Krithi Shetty
రామ్ హీరోగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ది వారియర్ (The Warriorr)తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో త్వరలో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది. ది వారియర్ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. జులై 14న వారియర్ విడుదల కానుంది.
Krithi Shetty
వీటితో పాటు సుధీర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో కృతి నటిస్తున్నారు. తాజాగా హీరో నాగ చైతన్యతో మరో మూవీ ప్రకటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికయ్యారు.
Krithi Shetty
ఇక వరుస ఆఫర్స్ బిజీగా ఉన్న కృతి ఫోటో షూట్స్ ఆపడం లేదు. తన సోషల్ మీడియా ఫ్యాన్స్ కోసం గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా ఎల్లో స్లీవ్ లెస్ ప్ ఫ్రాక్ లో కృతి ముద్దబంతి పువ్వులా మెరిసింది. కృతి లేటెస్ట్ ఫోటోస్ పై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Krithi Shetty
ఇక వరుస ఆఫర్స్ బిజీగా ఉన్న కృతి ఫోటో షూట్స్ ఆపడం లేదు. తన సోషల్ మీడియా ఫ్యాన్స్ కోసం గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా ఎల్లో స్లీవ్ లెస్ ప్ ఫ్రాక్ లో కృతి ముద్దబంతి పువ్వులా మెరిసింది. కృతి లేటెస్ట్ ఫోటోస్ పై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.