కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీ... నేరుగా క్లారిటీ ఇచ్చిన స్టార్ లేడీ
చాలా సౌమ్యంగా ఉండే కీర్తి సురేష్ పై ఎప్పుడూ ఏదో ఒక రూమర్. తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకు ఆమె కామెంట్స్ కారణమయ్యాయి.

Keerthy Suresh
కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ మామన్నన్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తుండగా వడివేలు కీలక రోల్ చేస్తున్నారు. జూన్ 29న మామన్నన్ విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ పాల్గొంటున్నారు. మామన్నన్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.
మామన్నన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. మీరు రాజకీయాల్లోకి వస్తారా? అని కొందరి అడుగుతున్నారు. దీనిపై ఆలోచించాలి అని ఆమె అన్నారు. కీర్తి కామెంట్ భవిష్యత్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కలదని, ఆమెకు ఆసక్తి ఉందని అర్థం అవుతుంది.
గతంలో కీర్తి సురేష్ బీజేపీలో జాయిన్ అవుతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ ఖండించారు. మరి భవిష్యత్ లో కీర్తి సురేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇక కీర్తి లేటెస్ట్ మూవీ దసరా సూపర్ హిట్ కొట్టింది. దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని హీరోగా తెరకెక్కిన దసరా మార్చి 30న విడుదలై మంచి విజయం సాధించింది. మహానటి తర్వాత కీర్తికి ఆ స్థాయి విజయం దసరాతో దక్కింది. అలాగే మహేష్ కి జంటగా నటించిన సర్కారు వారి పాట సైతం హిట్ టాక్ తెచ్చుకుంది.
ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి, సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది.