వయసు పెరుగుతున్న వన్నె తరగని గ్లామర్... కాజల్ అన్నం తింటుందా లేక అందం తింటుందా?
నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా కాజల్ అగర్వాల్ గ్లామర్ ఇసుమంత కూడా తగ్గలేదు. పైగా వయసు అంతకంతకూ తగ్గుతుందేమో అనిపిస్తుంది.

Kajal Aggarwal
పెళ్ళైనప్పటికీ కాజల్ (Kajal Aggarwal) గ్లామర్, ఫేమ్ ఏం తగ్గలేదు. వన్నె తరగని అందాలతో ఆమె మెస్మరైజ్ చేస్తుంది. మరో పదేళ్లు హీరోయిన్ రోల్స్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఈ స్టార్ లేడీ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. లాంగ్ కెరీర్ అనుభవిస్తున్న ఈ తరం హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. వివాహమైనా కూడా ఆమెకు డిమాండ్ తగ్గలేదు.
Kajal Aggarwal
2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయ్యారు. దర్శకుడు తేజా ఆమెను పరిశ్రమకు పరిచయం చేశారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అంతగా ఆడలేదు.
Kajal Aggarwal
దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీతో మొదటి హిట్ అందుకుంది. మగధీర మూవీతో స్టార్ హీరోయిన్ అయ్యారు. మగధీర అనంతరం కాజల్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అయ్యారు. టాప్ స్టార్స్ పక్కన నటించారు. బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేశారు.
Kajal Aggarwal
కెరీర్ స్వింగ్ లో ఉండగానే కాజల్ వివాహం చేసుకున్నారు. 2020 అక్టోబర్ నెలలో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. పెళ్ళికి ముందు ఒప్పుకున్న భారతీయుడు 2 మూవీ పూర్తి చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Kajal Aggarwal
కాజల్ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ భగవంత్ కేసరి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. కెరీర్లో ఫస్ట్ టైం ఆమె బాలయ్యతో జతకడుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక రోల్ చేస్తుంది.
భారతీయుడు 2, భగవంత్ కేసరి చిత్రాలతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ ఆమె చేస్తున్నారు.సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ అగర్వాల్ బాలీవుడ్ మీద ఆరోపణలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో విలువలు, నైతికత లేదన్నారు. నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ సౌత్ పరిశ్రమ ఆదరించింది అన్నారు.
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమల్లో మంచి వాతావరణం ఉంది. అందుకే అక్కడ గొప్ప చిత్రాలు, నటులు, టెక్నిషియన్స్ తయారవుతున్నారని అన్నారు. మరో హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం ఇదే అభిప్రాయం వెల్లడించారు.