- Home
- Entertainment
- సోయగాలపై పూలు పూయించిన జాన్వీ కపూర్... టైట్ బాడీ కాన్ డ్రెస్ లో దేవర హీరోయిన్ బోల్డ్ షో!
సోయగాలపై పూలు పూయించిన జాన్వీ కపూర్... టైట్ బాడీ కాన్ డ్రెస్ లో దేవర హీరోయిన్ బోల్డ్ షో!
హీరోయిన్ జాన్వీ కపూర్ అందాల విందులో అసలు తగ్గడం లేదు. స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో మెస్మరైజ్ చేసింది. జాన్వీ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.

Janhvi kapoor
జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ బవాల్. వరుణ్ ధావన్ హీరో. జులై 21 నుండి హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ విరివిగా పాల్గొంటున్నారు. నితేశ్ తివారి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. బవాల్ ప్రోమోలు ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
Janhvi kapoor
జాన్వీ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ దేవర. శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీ సౌత్ ఎంట్రీపై ఆసక్తి ఉంది. గతంలో పలువురు మేకర్స్ ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేశారు. దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి చూపారు. దేవరలో ఎన్టీఆర్-జాన్వీ జంటగా కనిపించనున్నారు.
Janhvi kapoor
ఎన్టీఆర్, జాన్వీ కాంబోపై క్రేజ్ నెలకొంది. ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్, జాన్వీ మదర్ శ్రీదేవి జంటగా పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతం చేశారు. వారి వారసులైన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ మొదటిసారి జతకడుతున్నారు. హైప్ కి ఇదొక అంశం కారణమైంది.
Janhvi kapoor
దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని విడుదలైన దేవర ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించింది.
Janhvi kapoor
కాగా దేవర చిత్రం కోసం జాన్వీ కపూర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఒక్క కమర్షియల్ హిట్ లేని జాన్వీ కోట్లు తీసుకోవడమంటే విశేషమే. కాగా ఈ చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. భవిష్యత్ లో జాన్వీ మరిన్ని తెలుగు, తమిళ చిత్రాలు చేసే అవకాశం కలదు. ఆమె కోలీవుడ్ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అయ్యిందంటూ కథనాలు వెలువడుతున్నాయి.
Janhvi kapoor
2018లో జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఆమె డెబ్యూ మూవీ ధఢక్. ఈ చిత్రం విడుదల కాకుండానే జాన్వీ తల్లి శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించారు. కూతురిని హీరోయిన్ గా చూడాలన్న శ్రీదేవి కల నెరవేరలేదు.