టాలీవుడ్ మేకర్స్ పై ఈషా రెబ్బ ఫైర్.... వైరల్ అవుతున్న కామెంట్స్..
టాలీవుడ్ మేకర్స్ పై మండిపడింది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా.. తెలుగు మేకర్స్ కు తెలుగు హీరోయిన్లు పనికిరారు.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చినవారంటేనే వారికి ఇష్టం అంటుుంది ఈషా.

తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాయి. తెలుగు మేకర్స్,తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో.. అద్భుతాలు చేస్తున్నారు. కాని హీరోయిన్ల విషయంలో మాత్రం టాలీవుడ్ లో చాలా మందికి అసంతృప్తి ఉంది. తెలుగు హీరోయిన్లు ఎంత కష్టపడ్డా.... టాలీవుడ్ మేకర్స్ పక్క రాష్ట్రాల హీరోయిన్ల కోసం తారాడుతున్నారు. ఈ విషయంలో ఎప్పటి నుంచో విమర్షలు ఎదుర్కోంటున్నారు.
ఈ విషయంలో తన అసంతృప్తిని వెలిబుచ్చింది హీరోయిన్ ఈషా రెబ్బా. ఎంతో మంది తెలుగు హీరోయిన్లు ..టాలీవుడ్ లో మంచి స్థాయిలో ఉండాలని ప్రయత్నం చేసి.. అవకాశాలు రాక వెనక్కి తగ్గారు. కొంత మంది మాత్రం తమిళ్ లో రాణిస్తున్నారు. కాని తెలుగు హీరోయిన్లు టాలెంట్ లో కాని .. గ్లామర్ లో కాని.. స్టార్ హీరోయిన్లకు తాను ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించరకుంటుంది ఈషా రెబ్బా.
ఎంత పోరాటం చేయడనికైనా రెడీ అంటోంది ఈషా.. తెుగులో సినిమాలు చేయడానికే ఇష్టపడుతుంది. అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. అందాలు ఆరబోస్తూ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను భారీగా పెంచుకుంటోంది. నటన పరంగా గట్టిగా టాలెంట్ చూపిస్తోంది. అయినా సరే సరైన అవకాశాలు రావడంలేదు. దాంతో తెలుగు మేకర్స్ పై మండిపడింది ఈషా.
ఇతర భాషల వాళ్లు తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంటుందని, అయితే టాలీవుడ్‌లో మాత్రం తెలుగమ్మాయిల కంటే పరాయి వాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది హీరోయిన్ ఈషా రెబ్బా. అరవింద సమేత వీర రాఘవ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ అచ్చ తెలుగు అందం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
Eesha Rebba
ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమా అవకాశాల గురించి మాట్లాడింది. ‘నేను ఇతర భాషా చిత్రాల్లో నటించినప్పుడు అక్కడి వాళ్లంతా తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకోవడం గర్వంగా అనిపించేది. అయితే మన దగ్గర మాత్రం పరభాషా నాయికలనే ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఎంత వరకూ కరెక్ట్ .. మన టాలెంట్ ను ఎప్పుడు గుర్తిస్తారు అని వాపోయింది బ్యూటీ.
అంతే కాదు ఇతర భాషల హీరోయిన్లు మాత్రమే కావాలని ప్రేక్షకులు డిమాండ్ చేయరు కదా? అలాంటప్పుడు వారికి అవకాశాలు ఇవ్వడంలో మతలబ్ ఏంటీ అని ఆమె ప్రశ్నిస్తుంది. ఈ విధంగా తన బాధను ఈషా రెబ్బ పేర్కొంది. ప్రస్తుతం ఈషా తెలుగులో ‘మాయా మశ్చీంద్ర’ ‘దయా’ సినిమాల్లో నటిస్తుంది.