MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత మాదిరిగా అరుదైన వ్యాధికి గురైన హీరోయిన్ దెబీనా బోనర్జీ, వైరల్ అవుతున్న పోస్ట్

సమంత మాదిరిగా అరుదైన వ్యాధికి గురైన హీరోయిన్ దెబీనా బోనర్జీ, వైరల్ అవుతున్న పోస్ట్

ఈమధ్య చాలా మంది హీరోయిన్లు అరుదైన వింత వ్యాధులకు గురవుతూ ఉన్నారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్లకు కూడా తప్పలేదు ఈ ఇబ్బందులు. ఈక్రమంలోనే మరో హీరోయిన్ కూడా ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్నట్టుగా వెల్లడించింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 02 2023, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చాలా మంది ఫిల్మ్ సెలబ్రిటీలు వింత వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. టాలీవుడ్ నుంచి ఇటిప్పటికే సమంత మయోసైటీస్ వ్యాధిసోకి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సమంతతో పాటు మమతా మోహన్ దాస్ లాంటి ఎంతో మంది తమ అనారోగ్య ఇబ్బందుల గురించి పబ్లిక్ గానే చెప్పుకొచ్చారు. తాజాగా మరో హీరోయిన్ ఇలాంటి ఇబ్బందినే ఫేస్ చేస్తోంది.  
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ మధ్య చాలా మంది హీరోయిన్ల పేర్లు.. అరుదైన వ్యాధుల బారిన పడుతున్న వారి లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. తాజాగా మరో నటి అరుదైన వైరస్ బారిన పడినట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఆమె ఎవరో కాదు.. రామాయణం సీరియల్ లో సీతగా ఫేమస్ అయ్యి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. తెలుగులో అమ్మాయిలు అబ్బాయిలు, సిక్స్ లాంటి  సినిమాలలో హీరోయిన్‌గా నటించిన దెబీనా బోనర్జి. 
 

36

ఇక రామాయణం హిందీ సీరియల్‌లో సీతగా నటించి మెప్పించిన ఈ బ్యూటీ..  తర్వాత కాలంలో ఆ సీరియల్‌లో రాముడిగా నటించిన గురుమీత్ చౌదరినే  ప్రేమించి పెళ్ళాడింది. అంతే కాదు వీరికి ఇద్దరు పిల్లలు కూడా. ఈక్రమంలో ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న దెబీనా బోనర్జీ.. తను అరుదైన వ్యాధికి గురయినట్టు వెల్లడించింది. 

46
Image: Debina Bonnerjee / Instagram

Image: Debina Bonnerjee / Instagram

దెబీనా బోనర్జికి ఇన్ఫ్లుఎంజా బి అనే అరుదైన వైరస్ బారిన పడింది ఈ వైరస్ సోకడంతో ఆమె చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ సోకితే పిల్లలకు చాలా ప్రమాదం. దాంతో ఆమె తన పిల్లలకు కూడా దూరంగా ఉండాల్సి వస్తోంది. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ.. ట్రీట్మెంట్ తీసుకుంటున్న దెబినా బోనర్జీ... ఈ విషయం స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా  ప్రకటించింది.

56

ఇక ఆమెకు ఈ వ్యాధి  ఎలా సంక్రమించిందో కూడా వివరించింది దెబీనా.. రీసెంట్‌గా ప్యామిలీతో కలిసి  వెకేషన్ కోసం  శ్రీలంక వెళ్లిన దెబీనా.. అక్కడ నుంచి వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యిందట. .. వెంటనే డాక్టర్‌ని సంప్రదించిందట. కానీ ఎంత మాత్రం ఆమెకున్న ప్రాబ్లమ్ తగ్గకపోవడంతో.. డాక్టర్స్ కొన్ని మెడికల్ టెస్ట్‌లు సూచించారట. ఈ టెస్ట్‌లలో తనకు ఇన్ఫ్లుఎంజా బి అనే అరుదైన వ్యాధి ఆమెకు సోకిందని డాక్టర్స్ నిర్ధారించారట. 
 

66

పిల్లలిద్దరు చిన్నవారు అవ్వడం.. పిల్లలకు దూరంగా ఉండాల్సి రావడంతో.. ఏం పాలుపోని పరిస్థితుల్లో ఉంది దేబినా బోనార్జీ.  ప్రాణానికి ప్రాణమైన పిల్లలని వదిలి.. వారికి దూరంగా ఉండటం కొంచెం కష్టమే. కానీ వారి ఆరోగ్యం దృష్ట్యా తప్పదని తనను తానే ఓదార్చుకుంటుంది సీనియర్ హీరోయిన్. ఇక ఆమె పెట్టిన ఈ పోస్ట్ కు రకరాల కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా దెబీనా బోనర్జీ కిసానుభూతిగా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image2
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Recommended image3
Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved