నేను చాలా సెన్సిటీవ్, ప్రభాస్ తో రిలేషన్ పై స్పందించిన అనుష్క శెట్టి
దాదాపు 5 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత మళ్లీ వెండితెరపై మెరవబోతోంది అనుష్క శెట్టి. ఇక ఆమె సినిమాలు చేయదు అని నిరాశపడ్డ ఫ్యాన్స్ కు ఈసినిమా ఊరట కాబోతోంది. ఈసందర్భంగా అనుష్క శెట్టి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Anushka Shetty
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి. దాదాపు 5 ఏళ్ళ విరామం తరువాత మళ్ళీ వెండితెరపై మెరవబోతోంది. ఈనేపథ్యంలో అనుష్క ఈసినిమాకు సబంధించిన అతి కొద్ది కార్కక్రమాల్లో పాల్గొంటూ..ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన అనుష్క కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
ఈసినిమా చేయడంతో పాటు..ప్రభాస్ తో రిలేషన్.. తన మూవీ కెరీర్.. పెళ్లి గురించి కూడా స్పందించారు అనుష్క శెట్టి. తాను చాలా సెన్సిటీవ్ అంటూ కామెంట్ చేసిన అనుష్క.. తనకు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఎప్పుడు అండగా ఉన్నాయని.. అందుకే కాంట్రవర్సీలు తన దగ్గరకి రాలేదన్నారు. అంతే కాదు వివాదాలను తాను హ్యాండిల్ చేయలేనన్నారు అనుష్క.
ఇక ప్రభాస్ తనకు ఎప్పటికి మర్చిపోలేని బెస్ట్ ఫ్రెండ్ అన్నారు అనుష్క శెట్టి. ప్రభాస్ తో పరిచయం 2005 నుంచి ఉందని.. అప్పుడు ప్రభాస్ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.. ఆయనలో ఏమాత్రం మార్పు లేదు అన్నారు అనుష్క. ప్రభాస్ తనకు వెరీ డియర్ ఫ్రెండ్ అన్నారు అనుష్క.
Anushka Shetty
అంతే కాదు ఎదుటివారు హర్ట్ అయ్యేలా మాట్లాడటం తనకు చేతకాదు అన్నారు. మన మనసులో ఉన్నది ఉన్నట్టు చెపితే అది సమాజం యాక్సప్ట్ చేయదన్నారు. ఏదైనా చెప్పాలి అంటే.. అది ఎదుటివారికి అర్ధం అయ్యేలా.. వారి ఎమోషన్స్ హర్ట్ అవ్వకుండా చెప్పాలన్నారు.
ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా గురించి మాట్లాడుతూ.. ఈసినిమాలో తాను నటించడం చాలా విచిత్రంగా జరిగిందన్నారు. తనకు బాగా కాలవ్సిన వారి ద్వారా మహేష్ ఓ సారి కలిశారట. అయితే తన కోసం కాకు కాని.. సరదాగా ఈసినిమా కథ వినిపించారని.. కథ విని తాను ఇంప్రెస్ అయ్యాను అంటున్నారు అనుష్క. అంతే కాదు ఈ సినిమాలో అన్విత పాత్ర ఎవరు చేస్తున్నారు అంటే.. ఇంకా ఎవరిని అనుకోలేదు అన్నారట దర్శకుడు. దాంతో తానే చేస్తాను అని అనుష్క చెప్పేసిందట.
ఇక తన పెళ్ళి గురించి ప్రస్తావన రాగా..పెళ్ళి అనేది మంచి విషయం.. అనుకోగానే జరిగిపోయేది కాదు. అది కుదిరినప్పుడు గుడ్ న్యూస్ ను తానే శేర్ చేస్తానని చెప్పింది అనుష్క. ఇక ఈమధ్య గుళ్లకు ఎక్కువగా తిరుగుతున్నారు.. భక్తి బాగా ఎక్కువయ్యింది. పెళ్ళి గురించేనే అని అడగ్గా..తన కుటుంబం ఆధ్మాత్మికం ఉంటారని.. వారంలో రెండు మూడు రోజులు గుడికి వెళ్లడం కామన్ అని చెప్పింది అనుష్క. అంతే కాదు తాను సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.. ఇక ఈ మధ్య సినిమాలకు లాంగ్ గ్యాప్ రావడంతో.. దైవ దర్శనాలు చేసుకున్నాను.. దాంట్లో వేరే ఉద్యేశ్యం లేదు అన్నారు.
ఇలా తన కెరీర్ గురించి .. జీవితంలో తాను చేసిన అరుంధతి, బాగమతి, దేవసేన లాంటి పాత్రల గురించి అనుష్క సంతృప్తి వ్యక్తం చేసింది. గ్లామర్ రోల్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా తన సత్తా నిరూపించుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది బ్యూటీ. ప్రస్తుతం