- Home
- Entertainment
- Charmy Kaur: పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన చార్మి కౌర్, ఆహీరో ఒప్పుకోగానే చేసుకుంటుందట..?
Charmy Kaur: పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన చార్మి కౌర్, ఆహీరో ఒప్పుకోగానే చేసుకుంటుందట..?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఏజ్ బార్ అవుతున్నా.. వారు పెళ్లి ఊసు ఎత్తడం లేదు. వారి పెళ్ళి గురించి వారికంటే మీడియాకు, అభిమానులకే ఆత్రుత ఎక్కువగా పెరిగిపోతోంది. అలా చాలా ఏజ్ వచ్చినా పెళ్ళి చేసుకోని వారిలో ప్రభాస్,అనుష్క, చార్మిలాంటివారు ఉన్నారు. ఈక్రమంలో తన పెళ్ళి గురించి పక్కాగా క్లారిటీ ఇచ్చేసింది చార్మి.
- FB
- TW
- Linkdin
Follow Us

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఏజ్ బార్ అవుతున్నా.. వారు పెళ్లి ఊసు ఎత్తడం లేదు. వారి పెళ్ళి గురించి వారికంటే మీడియాకు, అభిమానులకే ఆత్రుత ఎక్కువగా పెరిగిపోతోంది. అలా చాలా ఏజ్ వచ్చినా పెళ్ళి చేసుకోని వారిలో ప్రభాస్,అనుష్క, చార్మిలాంటివారు ఉన్నారు. ఈక్రమంలో తన పెళ్ళి గురించి పక్కాగా క్లారిటీ ఇచ్చేసింది చార్మి.
టాలీవుడ్ లో హాట్ హీరయిన్ గా ఓ పదేళ్ళు ఊపు ఊపేసింది చార్మి. చార్మి అందాలకు ఫిదా అవ్వనివారు లేరు అప్పట్లో. చిన్నహీరోలు .. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది బ్యూటీ. సూపర్ హిట్ సినిమాలు చేసి..మంచి గుర్తింపు సాధించింది. ఇక హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన తరువాత ఆమె నిర్మాత అవతారం ఎత్తింది. నిర్మాతగా మంచి మంచి సినిమాలు నతీస్తోంది బ్యూటీ.
Puri Jagannadh
ఇక ప్రస్తుతం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పేరుతో ప్రొడక్షన్ సంస్థ స్టార్ట్ చేసింది చార్మి. ఇద్దరు కలిసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే నిర్మాతగా మాత్రం ఛార్మి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇలా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు.
36 ఏళ్ళు వచ్చినా ఆమె ఇంకా పెళ్ళి వైపు ఆలోచన వెళ్లలేదు. అయితే ఈమె పెళ్లి గురించి ఎప్పటికప్పుడు మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. అంతే కాదు చార్మి పెళ్ళి గురించి ఎన్నో రకాల వార్తలు కొత్త కొత్తగా వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఈమె సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు పుకార్లు షికారు చేశాయి.
ఆతరువాత వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. దాంతో వీరు రిలేషన్ బ్రేక్ చేసుకున్నట్టు తెలిసింది ఇక చార్మి ఎక్కువగా ముంబయ్ లోనే ఉంటోంది. పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు చేస్తూ.. స్టోరీ వర్క్స్ లో ఇద్దరు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇక ఎక్కువగా వీరుకలిసి తిరగే సరికి..వీరిపై కూడా రకరకాల రూమర్లు బయటకు వచ్చాయి.
ఇక చార్మి తన పెళ్లి గురించి చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చెప్పుకొచ్చింది. తాజాగా తన పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడింది బ్యూటీ. ఆమె మాట్లాడుతూ తనకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. అప్పట్లో ఆయనకు పెళ్లి జరిగిందని తెలిసి చాలా బాధపడ్డానని ఈమె తెలియజేశారు.
ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్ సింగిల్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనకు మరోసారి పెళ్లి జరిగితేనే నేను పెళ్లి చేసుకుంటానని ఆయన పెళ్లి తర్వాతే నా పెళ్లి జరుగుతుంది అంటూ చార్మి తన పెళ్ళిమీద ఫన్నీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.