- Home
- Entertainment
- నడుమును విల్లులా వంచి హాట్ యోగా ఫోజులతో కిక్ ఇస్తున్న అనన్య.. వకీల్ సాబ్ బ్యూటీ గ్లామర్ సీక్రెట్ ఇదా!
నడుమును విల్లులా వంచి హాట్ యోగా ఫోజులతో కిక్ ఇస్తున్న అనన్య.. వకీల్ సాబ్ బ్యూటీ గ్లామర్ సీక్రెట్ ఇదా!
జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే (International yoga day). దీన్ని పురస్కరించుకొని అందాలు భామలు యోగా ఫోజుల్లో అద్భుతమైన ఫోటో షూట్స్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ సైతం తన యోగాసనాల ఫోటోలు షేర్ చేశారు.

శరీరాన్ని విల్లులా వచ్చిన కఠినమైన ఆసనాలు అలవోకగా వేస్తున్న అనన్యను చూసి ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. అమ్మడు గ్లామర్ రహస్యం ఇదా అంటున్నారు. అందానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనం. వయసును తగ్గించుకోవడానికి, చర్మం మెరిసేలా చేసుకోవాలంటే యోగా బెస్ట్ టెక్నిక్ అందుకే పరిశ్రమలోని హీరోయిన్స్ అందరూ యోగ చేస్తారు.
వకీల్ సాబ్ మూవీతో అనన్య నాగళ్ళ (Ananya Nagalla)వెలుగులోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా.. అనన్య కీలక రోల్ చేస్తారు. ముగ్గురు అమ్మాయిల నేపథ్యంలో తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీతో అనన్య నటించారు.
హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రంలో అంజలి, నివేదా థామస్ లతో పాటు అనన్య ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశారు. వకీల్ సాబ్ (Vakeel saab)సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా అనన్యకు ఇంకా బ్రేక్ రాలేదు. ఆమె ఓ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణా చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మల్లేశం మూవీతో అనన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. మల్లేశం ఆమె మొదటి మూవీ. ఆ చిత్రం కమర్షియల్ గా ఆడకున్నా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. మల్లేశం చిత్రంలో అనన్య టైటిల్ రోల్ చేసిన ప్రియదర్శి భార్యగా కనిపించారు.
అనంతరం ప్లే బ్యాక్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఓ స్మాల్ బడ్జెట్ మూవీ చేశారు. అనూహ్యంగా వకీల్ సాబ్ మూవీ ఆఫర్ దక్కించుకున్నారు. ఈ చిత్రం తర్వాతే అనన్య అనే ఓ హీరోయిన్ ఉన్నారన్న విషయం తెలుగు ప్రేక్షకులు తెలిసింది. వకీల్ సాబ్ తర్వాత కూడా అనన్యకు సోలో హీరోయిన్ ఆఫర్స్ రావడం లేదు.
నితిన్ మూవీ మ్యాస్ట్రో లో ఓ చిన్న పాత్ర చేసింది. నటుడు నరేష్ కూతురు పాత్రలో ఆమె కనిపించారు. ప్రస్తుతం సమంత (Samantha)ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రం చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శాకుంతలం పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతున్న విషయం తెల్సిందే.
కెరీర్ ఏమంత జోరుగా లేకుండా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అనన్య. ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ... ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెల్లగా ఆమె పాపులారిటీ ఇంస్టాగ్రామ్ లో పెరుగుతూ పోతుంది.