- Home
- Entertainment
- ప్రియుడ్ని వెచ్చని కౌగిలిలో బంధించిన శ్రుతి హాసన్... నా సర్వస్వం అంటూ ఊపిరి ఆడకుండా ఒకటే ముద్దులు!
ప్రియుడ్ని వెచ్చని కౌగిలిలో బంధించిన శ్రుతి హాసన్... నా సర్వస్వం అంటూ ఊపిరి ఆడకుండా ఒకటే ముద్దులు!
శృతి హాసన్ ప్రియుడు శాంతను హజారికతో సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేశారు. అతన్ని కౌగిలిలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేశారు.

Shruti Haasan
కమల్ హాసన్ వారసురాలు శృతి హాసన్ లైఫ్ స్టైల్ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆమెది అంతా ఫారిన్ కల్చర్. రిలేషన్స్, ఎఫైర్స్ గట్రా ఓపెన్ గా పెట్టుకుంటుంది. అందులో ఎలాంటి దాపరికం ఉండదు. కొన్నాళ్ళు లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో శృతి ఎఫైర్ నడిపింది. అతడితో సహజీవనం చేసింది.
మైఖేల్ కోసం శృతి కెరీర్ కూడా వదిలేసింది. 2017 తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దాదాపు రెండేళ్లు ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. అంత ఘాడంగా మైఖేల్ ని లవ్ చేసింది. అనూహ్యంగా 2019లో ఈ జంట విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పుకున్నారు.
కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న శృతి 2020లో మరో రిలేషన్ స్టార్ట్ చేసింది. ఈసారి ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికను ఎంచుకుంది. రెండున్నరేళ్లకు పైగా అతనితో సహజీవనం చేస్తుంది. శాంతనుతో దిగిన ఫోటోలు,వీడియోలు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.
Shruti Haasan
శాంతను-శృతి హాసన్ ముంబైలో ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. శాంతనుతో ఆమె రిలేషన్ బహిరంగ రహస్యమే. తాజాగా ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో శాంతనుని కౌగిలిలో బంధించిన ఫోటో షేర్ చేశారు. సదరు ఫోటోకి 'నా సర్వసం' అని హార్ట్ ఎమోజీ జోడించారు. ప్రియుడితో ఉన్న ప్రైవేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శృతి తన బోల్డ్నెస్ నిరూపించుకుంటుంది.
కాగా శృతి హాసన్ కెరీర్ మరలా పుంజుకుంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో ఆమె భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కమ్ బ్యాక్ తర్వాత శృతి హాసన్ నటించిన క్రాక్, వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వరుసగా విజయాలు అందుకున్నాయి.
ప్రస్తుతం ఆమె ప్రభాస్ కి జంటగా సలార్ లో నటిస్తున్నారు. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 28 విడుదల తేదీగా ప్రకటించారు. సలార్ తో పాటు ఓ ఇంగ్లీష్ చిత్రంలో శృతి హాసన్ నటిస్తున్నారు.