- Home
- Entertainment
- Sai Pallavi: షాకింగ్ న్యూస్ పెళ్ళికి సిద్ధమైన సాయి పల్లవి... నటనకు గుడ్ బై చెప్పనున్న నేచురల్ బ్యూటీ?
Sai Pallavi: షాకింగ్ న్యూస్ పెళ్ళికి సిద్ధమైన సాయి పల్లవి... నటనకు గుడ్ బై చెప్పనున్న నేచురల్ బ్యూటీ?
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోరుమీదున్న సాయి పల్లవి కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. కారణం ఆమె పెళ్ళికి సిద్దమయ్యారట. ఈ క్రమంలో సాయి పల్లవి నటనకు గుడ్ బై చెప్పనున్నారట.

Sai Pallavi
హీరోయిన్ అనే పదానికి గౌరవం తెచ్చిన అతికొద్ది మంది నటీమణుల్లో సాయి పల్లవి (Sai Pallavi) ఒకరు. సాయి పల్లవి సిద్దంతాలు, ఆమె ఎంచుకునే పాత్రలు, ప్రత్యేకమైన వ్యక్తిత్వం అరుదైన నటిగా మార్చేశాయి. హీరో ఎవరైనా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఆమె నటిస్తారు. చిరంజీవి (Chiranjeevi) లాంటి స్టార్ పక్కన చెల్లి పాత్ర చేయనని చెప్పడం నిజంగా సాహసమే.
నేను ఇలానే ఉంటాను అంటే పరిశ్రమలో నెగ్గుకురావడం కష్టం. కానీ ఈ సూత్రాలకు సాయి పల్లవి అతీతం. కాగా హీరోయిన్ గా సూపర్ ఫార్మ్ లో ఉన్న ఆమె పెళ్ళికి సిద్దమైనట్లు తెలుస్తోంది. పెళ్లి కోసం ఆమె కెరీర్ ని పక్కనబెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి కొత్త సినిమాలకు సైన్ చేయని కారణం అదే అంటున్నారు.
సాయి పల్లవి గత రెండు చిత్రాలు లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో సాయి పల్లవి నటన అద్భుతమని చెప్పాలి. వరుస హిట్స్ నేపథ్యంలో ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. సాయి పల్లవి మాత్రం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. కారణం ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నారట. అందుకే సినిమాలను పక్కనపెట్టి గృహిణిగా మారాలనేది ఆమె ఆలోచన అంటూ కోలీవుడ్ వర్గాల బోగట్టా.
అయితే సాయి పల్లవి పెళ్లి (Sai Pallavi Marriage) వార్తలను ఆమె సన్నిహితులు ఖండిస్తున్నారు. స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండే సాయి పల్లవి మంచి చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేగాని ఆమె పెళ్ళికి సిద్ధమయ్యారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కాబట్టి మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
సాయి పల్లవి ప్రస్తుతం విరాట పర్వం మూవీ చేస్తున్నారు. షూటింగ్ కూడా కంప్లీట్ కాగా... విడుదల ఆలస్యమైంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన విరాటపర్వం మూవీలో సాయి పల్లవి విలేజ్ గర్ల్ రోల్ చేశారు. రానా ఈ మూవీలో నక్సల్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే.
Saipallavi new look
మరోవైపు సాయి పల్లవి డాక్టర్ కాగా... సినిమాలు వదిలేసినా తనకంటూ ఓ కెరీర్ ఉంది. నిజంగా పెళ్లి చేసుకొని ఆమె నటన మానేస్తే అభిమానులు మాత్రం చాలా బాధ పడతారు. ప్రస్తుతం సాయి పల్లవి ఏజ్ 29, పెళ్ళికి సరైన సమయం. ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ ముప్పైయేళ్లు దాటినా పెళ్లి చేసుకోరు. మరి సాయి పల్లవి ఆలోచన ఏమిటో చూడాలి.
sai pallavi
గతంలో సాయి పల్లవి అసలు పెళ్లి చేసుకోనని చెప్పడం కొసమెరుపు. తల్లిదండ్రులతో జీవితాంతం ఉండిపోతానన్న సాయి పల్లవి పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. కాబట్టి సాయి పల్లవికి త్వరలో పెళ్లి అంటూ వస్తున్న కథనాలు నమ్మలేం. అదే సమయంలో ఆమె మరిన్ని చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం...
ఇటీవల శ్యామ్‌సింగరాయ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన విషయం చెబుతూ, తన పాటకి అద్భుతమైన స్పందన లభించిందని, ఆ పాట విన్నాక అంతా అరుస్తూ గోల చేయడం, సాయిపల్లవి అంటూ సౌండ్ చేయడం, పైగా గెస్ట్ లు కూడా పాట గురించి, తన డాన్సు గురించి ప్రశంసిస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయానని తెలిపింది సాయిపల్లవి.