టాప్ టూ బాటమ్ జీన్స్ వేసి, అల్ట్రా స్టైలిష్ లుక్ లో నాటీ పోజులిచ్చిన ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తిరుగు లేకుండా దూసుకుపోతుంది హీరోయిన్ ప్రియమణి. సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ పాత్రలతో పాటు, కీలకమైన క్యారెక్టర్ పాత్రలు చేస్తున్న ప్రియమణి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ ఉన్నాయి.
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ ఇలా అన్ని బాషలలో కలిపి అరడజనుకు పైగా సినిమాలు ప్రియమణి చేస్తున్నారు. తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్పలో వెంకీ భార్యగా, మధ్య వయసుకు మహిళగా కనిపించనున్నారు.
ఇక రానా హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ రెవల్యూషనరీ డ్రామా విరాట పర్వం మూవీలో లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు ఆమె.
ఇక హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా మైదాన్. ఈ చిత్రంలో ప్రియమణి ఆయనకు జంటగా నటిస్తున్నారు.
వీటితో పాటు మరో మూడు కన్నడ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. సినిమాలతో పాటు టీవీ షోలలో కూడా సందడి చేస్తుంది ప్రియమణి.
తెలుగు పాప్యులర్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె ఉన్నారు. జడ్జి కుర్చీలో ఉన్నప్పటికీ గ్లామర్ , రొమాన్స్ మరియు కామెడీ పంచుతూ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఇక పెళ్లి తరువాత కూడా గ్లామర్ డోస్ తగ్గించడం లేదు ప్రియమణి. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు గుండెలను పిండేస్తున్నారు.
తాజాగా టాప్ టూ బాటమ్ డెనిమ్ జీన్స్ ధరించి, క్రేజీ ఫోజులిచ్చింది అమ్మడు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రియమణి సెక్సీ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్లూ జీన్స్ అవుట్ ఫిట్ కి కాంట్రాస్ట్ గా పింక్ హై హీల్స్ వేసిన ప్రియమణి చాలా ట్రెండీగా కనిపించారు.
అటు వెండితెర మెరుస్తూ, ఇటు బుల్లితెరను ఏలుతూ కెరీర్ ని జెట్ స్పీడ్ తో ముందుకు నడిపిస్తుంది ప్రియమణి.