- Home
- Entertainment
- Vishwak Sen- Devi: పబ్లిక్ న్యూసెన్స్ టు ఉమెన్ రెస్పెక్ట్... విశ్వక్ సేన్ వివాదంలో నవ్వులపాలైందెవరు?
Vishwak Sen- Devi: పబ్లిక్ న్యూసెన్స్ టు ఉమెన్ రెస్పెక్ట్... విశ్వక్ సేన్ వివాదంలో నవ్వులపాలైందెవరు?
విశ్వక్ సేన్ తన సినిమా కోసం వీధికెక్కాడు. జనాలు ఆగ్రహించారు. ఓ మీడియా సంస్థ దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసింది. కట్ చేస్తే... ఫ్రాంక్ వీడియో ఘటన కాస్తా ఆడవాళ్లు, ఆత్మగౌరవం అంటూ కొత్త వివాదంగా మలుపు తీసుకుంది. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉన్న విశ్వక్ సేన్ వివాదంలో బద్నామ్ అయ్యింది ఎవరూ..?

విశ్వక్ సేన్ (Vishwak Sen)అంటేనే వివాదం. ఈ యంగ్ హీరో యూత్ లో క్రేజ్ తెచ్చుకోవడం కోసం తనదైన పంథా ఫాలో అవుతున్నాడు. అదేంటంటే డోంట్ కేర్ యాటిట్యూడ్. పబ్లిక్ లో బూతు పదాలు వాడడం, నేనింతే అన్నట్లు బిహేవ్ చేయడం. ఈ స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్ కొందరికి వర్కవుట్ అయ్యింది. సో... విశ్వక్ సేన్ గుడ్డిగా ఆచరిస్తున్నారు.
గతంలో కూడా మనోడు కొన్ని వివాదాల్లో ఉన్నాడు. విశ్వక్ ట్రాక్ రికార్డు తాజా సంఘటనను పెద్దది చేసింది. అశోకవనంలో అర్జున కళ్యాణం (Ashokavanamlo Arjuna Kalyanam)మే 6న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్ర హీరో విశ్వక్ రోడ్డు ప్రక్కన ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంటే విశ్వక్, అతని టీం వారిస్తున్నట్లు డ్రామా క్రియేట్ చేశారు.
రోడ్డు ప్రక్కన చేసిన ఈ ఫ్రాంక్ వలన పబ్లిక్ ఇబ్బంది పడ్డారు అనేది విశ్వక్ పై వచ్చిన అభియోగం. రోడ్ సైడ్ వీరు చేసిన ఈ పని కారణంగా జనాలకు అసౌకర్యం ఏర్పడిందా? లేదా? అనేది ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా జనాలు ఓ అభిప్రాయానికి వచ్చి దీనిపై నెగిటివ్ గా స్పందించారు. బాధ్యత గల హీరో ఇలా పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఏమిటని మండిపడ్డారు.
Vishwak Sen
ఇంతవరకు ఓకే... ఈ వివాదంపై విశ్వక్ సేన్ ని ఓ ప్రముఖ మీడియా సంస్థ ఇంటర్వ్యూకి పిలవడం కొత్త వివాదానికి దారితీసింది. డేరింగ్ అండ్ డాషింగ్ ఉమన్ రిపోర్టర్ గా పేరున్న దేవి(Devi Nagavalli) హీరోపై విరుచుకుపడింది. అతని మానసిక స్థితిపై ఆరోపణలు చేసింది. ఈ కారణంగా విశ్వక్ అసహనానికి గురయ్యాడు. తన మెంటల్ కండిషన్ గురించి కామెంట్ చేసే హక్కు నీకు లేదన్నాడు.
Vishwak Sen
ఈ క్రమంలో ఆమె విశ్వక్ ని గెట్ అవుట్ అన్నారు. అతడు పిలిచింది మీరు... ఫ*** అంటూ స్టూడియో నుండి బయటికి వచ్చేశాడు. ఈ గొడవ మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు చిత్ర ప్రముఖుల వరకూ వెళ్ళింది. తప్పు ఎవరిదైనా అమ్మాయి అబ్బాయి మధ్య గొడవంటే ఆటోమేటిక్ గా ఆడవాళ్ళ వైపు సొసైటీ మొగ్గు చూపుతుంది. విశ్వక్-దేవి గొడవలో కూడా ఇదే జరిగింది.
హీరో విశ్వక్ ని నానా మాటలు అనేశారు. అతడిపై చర్యలకు సిద్ధమయ్యారు. తీరా స్టూడియోలో విశ్వక్, దేవి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన పూర్తి వీడియో చూసిన పలువురు దేవిదే తప్పని తేల్చారు. విశ్వక్ ప్లేస్ లో ఓ స్టార్ హీరో ఉంటే దేవి అలానే గెట్ అవుట్ అంటారా? అలాంటి ప్రశ్నలే అడుగుతారా? అంటూ మండిపడుతున్నారు.
Vishwak Sen
ఓ సినిమా ప్రమోషన్ కోసం మొదలైన డ్రామా కాస్తా ఆడవాళ్ళ ఆత్మగౌరవంగా టర్న్ తీసుకుంది. ఇక ఈ వివాదంలో దేవి కంటే కూడా విశ్వక్ కే ఎక్కువ మద్దతు లభిస్తుంది. చిత్ర ప్రముఖులతో పాటు నెటిజెన్స్ దేవి విషయంలో ఆయన తప్పేమీ లేదంటున్నారు. మొత్తంగా ఓ హీరోతో రూడ్ గా ప్రవర్తించిన రిపోర్టర్ దేవి విమర్శల పాలవుతున్నారు.