MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vishnu Vishal: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్‌ హీరో.. మూడేళ్లు దాచిన నిజం బట్టబయలు

Vishnu Vishal: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్‌ హీరో.. మూడేళ్లు దాచిన నిజం బట్టబయలు

Vishnu Vishal: గట్టా కుస్తీ 2(మట్టి కుస్తీ) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న హీరో విష్ణు విశాల్, తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు షాకింగ్ విషయం బయటపెట్టారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 25 2026, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గట్టా కుస్తీ(మట్టి కుస్తీ)2తో రాబోతున్న విష్ణు విశాల్‌
Image Credit : our own

గట్టా కుస్తీ(మట్టి కుస్తీ)2తో రాబోతున్న విష్ణు విశాల్‌

తమిళంలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్‌లు అందుకుంటున్న హీరో విష్ణు విశాల్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'గట్టా కుస్తీ 2'. ఇది గతంలో వచ్చిన `గట్టా కుస్తీ`(తెలుగులో మట్టి కుస్తీ)కి సీక్వెల్‌.  సినిమా జులై 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విష్ణు విశాల్ ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. తాను ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు అందులో వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తన ఆరోగ్య సమస్యని వెళ్లడించిన విష్ణు విశాల్‌
Image Credit : our own

తన ఆరోగ్య సమస్యని వెళ్లడించిన విష్ణు విశాల్‌

విష్ణు విశాల్ తన స్టేట్‌మెంట్‌లో ఇలా రాశారు: 'ముందుగా మీ ప్రేమకు, నాపై చూపిస్తున్న కేర్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా లేటెస్ట్ పోస్టులపై మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ చూశాను. అవి నాకు చాలా ఎమోషనల్‌గా, ఉత్సాహంగా అనిపించాయి. అందుకే ఈ విషయాన్ని మీతో నేరుగా పంచుకోవాలనుకుంటున్నా` అని అన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపారు. 

34
ఆటో ఇమ్యూన్‌ వ్యాధితో బాధపడుతున్న విష్ణు విశాల్‌
Image Credit : X

ఆటో ఇమ్యూన్‌ వ్యాధితో బాధపడుతున్న విష్ణు విశాల్‌

ఈ మధ్య నా ముఖం నీరసంగా కనిపిస్తోందని చాలామంది గమనించారు. దానికి కారణం, గత 3-4 ఏళ్లుగా నేను ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నాను. దానికోసం డాక్టర్లు సూచించిన మందులు వాడుతున్నాను. ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ వల్లే నాలో ఆ నీరసం. కానీ నా ఆరోగ్యానికి ఈ ట్రీట్‌మెంట్ చాలా అవసరం. అదే సమయంలో, మీరు చూపిస్తున్న ప్రేమ, నా పని మీద నాకున్న నమ్మకం, `గట్టా కుస్తీ 2' కోసం రాత్రింబవళ్లు కష్టపడిన టీమ్ పట్ల నా బాధ్యత నన్ను ముందుకు నడిపిస్తున్నాయి' అని విష్ణు విశాల్ తెలిపారు.

44
గట్టా కుస్తీ 2 మిమ్మల్ని ఆకట్టుకుంటుంది..
Image Credit : Instagram/@thevishnuvishal

గట్టా కుస్తీ 2 మిమ్మల్ని ఆకట్టుకుంటుంది..

‘అందుకే ఆరోగ్య సమస్యలు ఉన్నా, సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నాను. నా ఆరోగ్యం త్వరలోనే మెరుగుపడుతుంది. మీరు చూపిన కేర్, నా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టేలా చేసింది. ప్రతి కామెంట్‌కు, మీ సపోర్ట్‌కు థ్యాంక్స్. ప్రస్తుతం ’గట్టా కుస్తీ 2' ప్రమోషన్స్ చివరి దశలో ఉన్నాం. చాలా నమ్మకంతో, ఉత్సాహంగా ఉన్నాను. జులై 3న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను మీరంతా చూస్తారని ఎదురుచూస్తున్నా' అని విష్ణు విశాల్ వెల్లడించారు. ఇదిలా ఉంటే విష్ణు విశాల్‌ భార్య బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల అనే విషయం తెలిసిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image2
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image3
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Related Stories
Recommended image1
OG2: ఓజీ 2 కథ ఇదే, సుజీత్‌కి డేట్స్ ఇచ్చేసిన పవన్‌.. ఈ సారి ఎంత ఊహించుకున్నా తక్కువే
Recommended image2
Vadde Naveen: వడ్డే నవీన్‌ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకుల కారణంగానే హీరోగా కెరీర్‌ క్లోజ్‌, తొక్కేసింది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved