MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆర్తి అగర్వాల్, తరుణ్ ఇంట్లో చెప్పకుండా పెళ్లికి రెడీ అయ్యారా.. ముందే వార్నింగ్ ఇచ్చిన లవర్ బాయ్ తల్లి

ఆర్తి అగర్వాల్, తరుణ్ ఇంట్లో చెప్పకుండా పెళ్లికి రెడీ అయ్యారా.. ముందే వార్నింగ్ ఇచ్చిన లవర్ బాయ్ తల్లి

దివంగత నటి ఆర్తి అగర్వాల్ తెలుగులో చెరగని ముద్ర వేసింది. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, తరుణ్ లాంటి హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆర్తి అగర్వాల్ జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగాయి.

tirumala AN | Published : Jun 08 2024, 07:11 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

దివంగత నటి ఆర్తి అగర్వాల్ తెలుగులో చెరగని ముద్ర వేసింది. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, తరుణ్ లాంటి హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆర్తి అగర్వాల్ జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగాయి. చివరకు ఆమె 31 ఏళ్ళ అతి పిన్న వయసులోనే మరణించి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. 

27
Asianet Image

ఆర్తి అగర్వాల్ పేరు చెప్పగానే లవర్ బాయ్ హీరో తరుణ్ తో ప్రేమ వ్యవహారం గుర్తుకు వస్తుంది. తరుణ్ తో ప్రేమ బెడిసికొట్టడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిందని.. ఆ కారణంగా ఆసుపత్రి పాలైందని కూడా రూమర్స్ ఉన్నాయి. వీటన్నింటిపై తరుణ్ తల్లి, సీనియర్ నటి రోజా రమణి క్లారిటీ ఇచ్చారు. 

37
Asianet Image

తరుణ్ తో పెళ్లి క్యాన్సిల్ కావడం వల్లే ఆర్తి అగర్వాల్ డిప్రెషన్ లోకి వెళ్లిందా అని రోజా రమణిని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఆర్తి అగర్వాల్ ఆసుపత్రిలో చేరడానికి కారణం వేరే ఉంది. తరుణ్ తో లవ్ ఎఫైర్ అనేది మెయిన్ రీజన్ కాదు. వేరే కారణం ఉంది.. అయితే ఆ కారణం ఏంటి అనేది రోజా రమణి క్లారిటీ ఇవ్వలేదు. 

47
Asianet Image

తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య చాలా రూమర్స్ వచ్చాయి. వాళ్లిద్దరూ కలసి నటించింది రెండు సినిమాలే. అలా అయితే శ్రీయతో తరుణ్ నాలుగు సినిమాలు చేశాడు. శ్రీయ తరుణ్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నన్ను ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటుంది. ఆర్తి అగర్వాల్ తో నాకు పెద్దగా పరిచయం లేదు. బహుశా ఒక్కసారి కలిశానేమో. కానీ ఆర్తి అగర్వాల్ మంచి అమ్మాయి అని తెలుసు. 

57
Asianet Image

కానీ ఇద్దరి మధ్య సీరియస్ గా రూమర్స్ వచ్చాయి. ఇంట్లో పెద్దలుగా మేము వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదు అనుకోండి.. వాళ్ళకి సమస్య ఏంటి.. వాళ్లిద్దరూ మెజర్స్.. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు. పోనీ ఇంట్లో పెద్దలని ఒప్పించి చేసుకుని ఉండొచ్చు. తరుణ్.. ఆర్తి అగర్వాల్ తో పెళ్లి విషయం నాతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. 

67
Asianet Image

ఈ కాలం పిల్లలు ఇంట్లో ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోవడం మానేస్తారా అని రోజా రమణి అన్నారు. అయితే తరుణ్ ని మాత్రం తాను హెచ్చరించిన విషయం వాస్తవమే అని రోజా రమణి అన్నారు. మీ ఇద్దరి పై రూమర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అమ్మాయితో క్లోజ్ గా ఉంటే బయటకి అందరికి తెలిసేలా ఎందుకు ఎక్స్ ఫోజ్ అవడం.. కొంచెం జాగ్రత్త అని హెచ్చరించాను. 

77
Asianet Image

ఆ తర్వాత వాళ్లిద్దరూ కలసి నటించలేదు. ఆ అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వాళ్లిద్దరూ నిజంగా ప్రేమించుకుని ఉంటే మాకు చెప్పి ఉండాలి కదా అని రోజా రమణి అన్నారు. కానీ సడెన్ గా ఆమె చనిపోయింది అని న్యూస్ వచ్చింది. చాలా బాధపడ్డాం. ఆమె చాలా చిన్న పిల్ల.. అలా జరగడం బాధాకరం అని రోజా రమణి తెలిపారు. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories