736 రూపాయల నుంచి రూ.350 కోట్ల వరకు ఎదిగిన హీరో ఎవరో తెలుసా.. ఇష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చి ఇలా..
కొంతమంది నటులు వారసత్వంతో సినిమా రంగంలోకి వస్తారు. వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. మరికొంతమంది తండ్రులని మించేలా తమకంటూ ప్రత్యేక బ్రాండ్ సెట్ చేసుకుంటారు.
Suriya
కొంతమంది నటులు వారసత్వంతో సినిమా రంగంలోకి వస్తారు. వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. మరికొంతమంది తండ్రులని మించేలా తమకంటూ ప్రత్యేక బ్రాండ్ సెట్ చేసుకుంటారు. అలాంటి హీరోల్లో సూర్య ఒకరు.
సూర్య తండ్రి శివకుమార్ తమిళంలో పాపులర్ నటుడు. సూర్య తలచుకుంటే వెంటనే హీరోగా ఏంటి ఇవ్వొచ్చు. కానీ సూర్యకి సినిమా రంగం ఇష్టం లేదట. సూర్య కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య సినిమా రంగంతో సంబంధం లేకుండా ఏదైనా వ్యాపారంలో స్థిరపడాలనుకున్నాడట.
అందుకే వివిధ రకాల వ్యాపారాల గురించి యుక్త వయసులోనే తెలుసుకున్నాడు. చివరికి బట్టల వ్యాపారం సూర్యకి బాగా నచ్చింది. దీనితో బట్టల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఓ బట్టల ఫ్యాక్టరీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఆ ఫ్యాక్టరీలోనే సూర్య తన తొలి జీతం 736 రూపాయలు అందుకున్నాడు.
తన గమ్యం వైపు అడుగులు వేస్తున్న సమయంలో సూర్య సినిమాల్లోకి రాక తప్పలేదు. అదే విధి అంటే. దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం ప్రోత్సహించడంతో సూర్య సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. మణిరత్నం నిర్మించిన నేరుక్కు నేర్ అనే చిత్రంతో సూర్య 1997లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.
సూర్య అనేది అతడి అసలు పేరు కాదు. శరవణన్ శివకుమార్ అనేది సూర్య ఒరిజినల్ నేమ్. మణిరత్నం సూర్య అని పేరు మార్చారు. సూర్య అనే పేరు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో నటనకి ఒక బ్రాండ్ గా మారిపోయింది.
చిన్న ఉద్యోగిగా 736 రూపాయల తొలి జీతం అందుకున్న సూర్య.. ఇప్పుడు రూ 350 కోట్లకి అధిపతి. సౌత్ లో స్టార్ హీరోగా సూర్య భారీగా ఆస్తులు సంపాదించారు. త్వరలో సూర్య కంగువ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.