- Home
- Entertainment
- లెజెండ్రీ నటుడి కూతుర్ని ప్రేమించే ఛాన్స్, వద్దనుకుని దూరంగా ఉండిపోయిన క్రేజీ హీరో.. ఏం జరిగింది ?
లెజెండ్రీ నటుడి కూతుర్ని ప్రేమించే ఛాన్స్, వద్దనుకుని దూరంగా ఉండిపోయిన క్రేజీ హీరో.. ఏం జరిగింది ?
అప్పట్లో లెజెండ్రీ నటులు అంతా తమ కెరీర్ విషయంలో క్రమశిక్షణ పాటించే వారు. షూటింగ్ కి సరైన టైంకి చేరుకోవడం, నిర్మాతలని ఇబ్బంది పెట్టకపోవడం లాంటివి చాలా ముఖ్యం అని అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి లెజెండ్రీ నటులు భావించే వారు.

Suman
అప్పట్లో లెజెండ్రీ నటులు అంతా తమ కెరీర్ విషయంలో క్రమశిక్షణ పాటించే వారు. షూటింగ్ కి సరైన టైంకి చేరుకోవడం, నిర్మాతలని ఇబ్బంది పెట్టకపోవడం లాంటివి చాలా ముఖ్యం అని అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి లెజెండ్రీ నటులు భావించే వారు. క్రమ శిక్షణ విషయంలో హీరో సుమన్.. శోభన్ బాబుని ఆదర్శంగా తీసుకునేవారట. ఈ విషయాన్ని సుమన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Suman
సుమన్ తన కెరీర్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేయని తప్పుకి సుమన్ 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. దీనివల్ల కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో చాలా కోల్పోవలసి వచ్చింది. సుమన్ కి మార్షల్ ఆర్ట్స్ కూడా తెలుసు. దీనితో మంచి అవకాశాలు వచ్చేవి. ఆ తరుణంలో పెద్ద రచ్చ జరిగింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్, డిజిపి కలసి సుమన్ ని కేసులో ఇరికించారు అనే ప్రచారం ఉంది. డీజీపీ కూతురు సుమన్ ని ఇష్టపడేది అని కూడా వార్తలు ఉన్నాయి.
కానీ తాను మహిళల విషయంలో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని, తన హీరోయిన్లని కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదని సుమన్ పలు సందర్భాల్లో తెలిపారు. అందుకే తనతో నటించిన హీరోయిన్లు కూడా తనని చాలా గౌరవంగా చూస్తారని తెలిపారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా చాలా మంది హీరోయిన్లు సుమన్ తప్పు లేదని ఓపెన్ గా చెప్పారని తెలిపారు. తాను మంచి వాడిని కాబట్టే వాళ్లంతా తనకి సపోర్ట్ చేసారు అని సుమన్ గుర్తు చేసుకున్నారు.
నా కెరీర్ లో ఎప్పుడూ నేను క్రమశిక్షణ తప్పలేదు. శోభన్ బాబు గారి కుమార్తెతో కూడా నాకు పరిచయం ఉంది. ఆమె ప్రతి రోజు మా ఇంటికి వచ్చి అమ్మ దగ్గర డ్యాన్స్ నేర్చుకుని వెళ్ళేది. ఆ విధంగా శోభన్ బాబు కుమార్తె తో మంచి స్నేహం ఏర్పడింది. కానీ నేను ఎప్పుడూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. అప్పట్లో హీరోయిన్లు సైతం నన్ను ప్రేమించడానికి ప్రయత్నించారు. నేను అడిగితే ఎవరూ కాదనరు.
కానీ శోభన్ బాబు గారి కుమార్తె విషయంలో తాను హద్దులు దాటలేదని సుమన్ తెలిపారు. శోభన్ బాబు గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. క్రమశిక్షణ విషయంలో ఆయన తనకి ఆదర్శం అని సుమన్ తెలిపారు.