MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • డిప్రెషన్‌లోకి వెళ్లిన శ్రీకాంత్‌, ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్‌.. చిరంజీవి వల్లే మళ్లీ మామూలు మనిషి

డిప్రెషన్‌లోకి వెళ్లిన శ్రీకాంత్‌, ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్‌.. చిరంజీవి వల్లే మళ్లీ మామూలు మనిషి

హీరో శ్రీకాంత్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడట. తన కెరీర్‌ ఇక అయిపోయిందని భావించారు. అలాంటి సమయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చి మళ్లీ మామూలు మనిషిని చేశాడట. మరి ఏం జరిగిందంటే? 

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 14 2024, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మ్యాన్లీ హీరో శ్రీకాంత్‌ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన హీరో. ఫ్యామిలీ సినిమాలతోనే ఆయన హీరోగా నిలబడ్డాడు. మహిళల ఆదరణ పొందాడు. అప్పట్లో ఫ్యామిలీస్‌లో శ్రీకాంత్‌కి యమ క్రేజ్‌ ఉండేది. చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకటేష్‌లకు దీటుగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, జేడీ చక్రవర్తి వంటి వారితో సమకాలీకులుగా రాణించారు. మార్కెట్ వైజ్‌, ఇమేజ్‌ వైజ్‌ సెకండ్‌ లెవల్‌ హీరోగా మెప్పించారు. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

శ్రీకాంత్‌ హీరోగా, విలన్‌గా, హీరోగా మల్టీస్టారర్లతోపాటు, బలమైన పాత్రల్లోనూ నటించి మెప్పించారు. అప్పట్నుంచి ఆయన హీరోగానే చేయాలనే లిమిట్స్ పెట్టుకోలేదు. పాత్ర డిమాండ్‌ మేరకు ఎలాంటి సినిమాలైనా చేశారు. తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.

ఇప్పటికీ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల `స్కంధ`, `దేవర` చిత్రాల్లో బలమైన పాత్రలతో ఆడియెన్స్ ని అలరించారు. నటుడిగా ఓ సెపరేట్‌ ఇమేజ్‌ ఉన్న పాత్రలు చేస్తూ తన విలక్షణతని చాటుకుంటున్నారు శ్రీకాంత్‌. 
 

35

ఇదిలా ఉంటే శ్రీకాంత్‌ ఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లాడట. ఆయన కెరీర్‌ ఆల్మోస్ట్ క్లోజ్‌ అయ్యే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాంత్‌ని మళ్లీ మామూలు మనిషిని చేయడంలో చిరంజీవి పాత్ర ఎంతో ఉంది. శ్రీకాంత్‌ని చిరంజీవి సొంత తమ్ముడిలా భావిస్తారు. అలాగే శ్రీకాంత్‌ సైతం చిరుని సొంత అన్నయ్యలా భావిస్తారు.

ఇటీవల శ్రీకాంత్‌ పుట్టిన రోజుకి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కేక్‌ కట్‌ చేయించాడు చిరంజీవి. తన ప్రేమని, అనుబంధాన్ని చాటి చెప్పాడు. అయితే వీరిద్దరి మధ్య అనుబంధం ఇంతగా బలపడటానికి మరో కారణం ఉందట. ఆ విషయాన్ని శ్రీకాంత్‌ వెల్లడించారు. ఆ సమయంలో చిరంజీవి అన్నయ్య పిలవకపోతే తన పరిస్థితి వేరేలా ఉండేదన్నారు శ్రీకాంత్‌. 
 

45

ఓ దశలో తాను వరుసగా పరాజయాలు చవిచూశాడట. ఏ సినిమా చేసినా ఫెయిల్‌ అవుతుందట. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలా లో అయిపోయాడట. ఎంతో బాధపడుతున్నాడట. ఇలా తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపారు శ్రీకాంత్‌. తాను డల్‌గా ఉండటాన్ని గమనించిన చిరంజీవి పిలిపించాడట. ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి సినిమా షూటింగ్‌ జరుగుతుంది.

ఈ విషయం తెలియగానే శ్రీకాంత్‌ని పిలపించాడట. ఏంటి డల్‌గా ఉన్నావ్‌, ఏం జరిగిందంటే? ఇలా వరుసగా సినిమాలు పోతున్నాయని, ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొత్త సినిమాలు ఒప్పుకోవాలంటే భయమేస్తుందన్నాడట. ఇలా వరుస ఫ్లాప్‌ల వల్ల  శ్రీకాంత్‌కి సినిమా ఆఫర్లు తగ్గాయి, ఆయన్ కూడా తగ్గించాడు. 
 

55

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీకాంత్‌ డిప్రెషన్‌లోకి వెళ్లాడట. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి పిలిపించి ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్ చెప్పారట. తనకు జరిగిన సంఘటనలు, తాను ఫేస్‌ చేసిన సంఘటనలన్నీ చెప్పాడట చిరు. హిట్లు వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తామో, ఫ్లాప్‌లు వచ్చినప్పుడు అంతే స్పోర్టీవ్‌గా తీసుకోవాలని తెలిపాడట చిరంజీవి.

ప్రతి హీరోకి పరాజయాలు వస్తాయని, వాటి గురించే ఆలోచించే మంచి సినిమాలు చేయలేం, మనం అక్కడే ఆగిపోతాం, కెరీర్‌ డిస్టర్బ్ అవుతుంది. ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. మొత్తంగా అందరు ఇబ్బంది పడతారు, నువ్వే ధైర్యంగా ముందుకెళ్లాల్సి, ఇలా డిప్రెషన్‌కి గురి కావద్దంటూ చెప్పడంతో శ్రీకాంత్‌లో ఎనర్జీ వచ్చిందని, అప్పట్నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని, జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చారు శ్రీకాంత్‌.

ఇప్పుడు హీరోగా సినిమాలు పెద్దగా ఆడటం లేదు. దీంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు. నెగటివ్‌, పాజిటివ్‌ పాత్రలు చేస్తున్నారు. సినిమాల్లో బలమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. ఇక చిరంజీవి, శ్రీకాంత్‌ కూడా కలిసి నటించారు. `శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌`, `శంకర్‌ దాదా జిందాబాద్‌` సినిమాల్లో చిరంజీవికి రైట్ హ్యాండ్‌గా శ్రీకాంత్‌ చేసి మెప్పించాడు. అప్పట్లో వీరి కాంబోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

ఆ హీరోయిన్‌ పెద్ద సోమరిపోతూ, ఎప్పుడూ షూటింగ్‌లకు లేట్‌, నాగార్జునని ఇబ్బంది పెట్టిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image3
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved