- Home
- Entertainment
- తాను చేయాల్సిన మూవీ రాజశేఖర్‌కి, తలుచుకుని బాధపడ్డ స్టార్ హీరో, కట్ చేస్తే అప్పుల్లో నిర్మాత, ఆ సినిమా ఏంటి?
తాను చేయాల్సిన మూవీ రాజశేఖర్‌కి, తలుచుకుని బాధపడ్డ స్టార్ హీరో, కట్ చేస్తే అప్పుల్లో నిర్మాత, ఆ సినిమా ఏంటి?
Srikanth-Rajasekhar:ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో వద్దకు వెళ్లిపోవడం సర్వసాధారణమే. కానీ కొన్ని సినిమాలు మిస్ చేసుకున్నందుకు హీరోలు బాధపడతారు. మిస్ అయినందుకు కూడా బాధపడతారు. కానీ ఓ ఫ్లాప్ సినిమా విషయంలోనూ హీరో బాధపడటం గమనార్హం. ఈ సంఘటన శ్రీకాంత్, రాజశేఖర్ విషయంలో జరిగింది. శ్రీకాంత్ చేయాల్సిన మూవీ రాజశేఖర్ వద్దకు వెళ్లింది. కట్ చేస్తే ఆ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ దర్శకుడు, నిర్మాత కోలుకోని విధంగా అప్పుల్లో కూరుకుపోయారు. ఆ కథేంటో చూద్దాం.

rajasekhar
Srikanth-Rajasekhar:శ్రీకాంత్ ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో హీరోగా రాణించారు. వరుసగా విజయాలు సాధించింది ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. మ్యాన్లీ స్టార్‌గా ఎదిగారు. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్‌లకు పారలల్‌గా జగపతిబాబు, అర్జున్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోలకు పోటీగా శ్రీకాంత్ కూడా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు.
స్టార్ హీరోగా రాణించారు. అయితే ఓ సినిమా విషయంలో ఆయన బాగా బాధపడ్డాడు. తాను చేయాల్సిన మూవీ రాజశేఖర్ వద్దకు వెళ్లడమే దీనికి కారణం. చివరికి అదే సినిమాలో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించారు. కానీ హీరోగా మిస్ అయినందుకు బాధపడినట్టు తెలిపారు.
srikanth
శ్రీకాంత్.. అంజి టాక్స్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. శ్రీకాంత్‌కి దర్శకులు ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీకృష్ణా రెడ్డి వంటి దర్శకులు వరుస విజయాలు అందించారు. ఆడియెన్స్ కూడా ఓన్ చేసుకున్నారు. దీంతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకుని స్టార్ గా ఎదిగారు.
ఆ సమయంలోనే తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో `దొంగరాస్కేల్` సినిమా చేశారు శ్రీకాంత్. ఇది బాగానే ఆడింది. ఆ తర్వాత ఆయన దర్శక, నిర్మాతగా `వేటగాడు` సినిమా చేయాలనుకున్నారు. దాదాపు ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఈ మూవీ బాలీవుడ్‌లో వచ్చిన `బాజీగర్` చిత్రానికి రీమేక్. అది హాలీవుడ్ మూవీకి రీమేక్.
srikanth, rajasekhar
శ్రీకాంత్ హీరోగా సౌందర్య, రంభ హీరోయిన్లుగా ఈ మూవీని ఓకే చేశారు. కానీ అనుకోని కారణాలతో సడెన్‌గా హీరో మారిపోయారు. రాజశేఖర్ వద్దకు ఈ ప్రాజెక్ట్ వెళ్లిందట. ఆయన హీరోగా ఈ మూవీని స్టార్ట్ చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. దీనికి ఆయనే నిర్మాత, దర్శకుడు. చివర్లో ఓ కీలక పోలీస్ పాత్రకి శ్రీకాంత్‌నే తీసుకున్నారట.
అయితే ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో శ్రీకాంత్ చాలా సార్లు తన బాధని వ్యక్తం చేశారట. రాజశేఖర్‌తోనే అన్నాడట. తాను చేయాల్సింది, ఇలా జరిగిందని, దానికి రాజశేఖర్ కూడా పాజిటివ్‌గా స్పందించి ఎంకరేజ్ చేశారని తెలిపారు శ్రీకాంత్. కొన్ని సినిమాల విషయంలో అలా జరుగుతుందన్నారు. అది మన చేతుల్లో లేదని తెలిపారు.
vetagadu movie, rajasekhar
అయితే శ్రీకాంత్ బాధపడే విషయం ఏంటంటే, ఆ సమయంలో తాను చేస్తున్న సినిమాలకంటే `వేటగాడు` చాలా పెద్ద ప్రాజెక్ట్. సౌందర్య, రంభ అప్పట్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు. ఈసినిమా పడితే తన లైఫ్ మారిపోతుందని, పెద్ద రేంజ్ కి వెళ్లిపోతానని శ్రీకాంత్ బాగా ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో ప్రాజెక్ట్ తన చేతుల నుంచి వెళ్లిపోయింది. అదే తనని బాధపెట్టింది.
rajasekhar (photo credit-etv)
ఇక రాజశేఖర్ హీరోగా, సౌందర్య, రంభ హీరోయిన్లుగా, తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన ఈ చిత్రం 1995లో విడుదలైంది. కానీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీనికి కారణం రాజశేఖరే అని తెలిపారు రైటర్ తోట ప్రసాద్. హిందీ చిత్రంలో షారూఖ్ ఖాన్ హీరోగా నటించగా, అప్పటికీ ఆయనకు హిందీలో పేరు లేదు, ఆయన పాత్రలో నెగటివిటీ ఉండటంతో అక్కడి ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్నారు.
కానీ తెలుగులో రాజశేఖర్‌కి మంచి స్టార్ ఇమేజ్ ఉంది. పైగా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అలాంటి టైమ్‌లో రాజశేఖర్ పాత్రలో నెగటివ్ షేడ్ ఉండటంతో మన ఆడియెన్స్ తీసుకోలేకపోయారని, అందుకే సినిమా పరాజయం చెందిందని తోట ప్రసాద్ తెలిపారు. ఈ మూవీతో తమ్మారెడ్డి కూడా భారీగా నష్టపోయారు. కోలుకోని విధంగా అప్పుల్లోకి వెళ్లిపోయారట.