MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదితిరావ్ హైదరితో ఎఫైర్ నిజమే... హింట్ ఇచ్చేసిన సిద్ధార్థ్!

అదితిరావ్ హైదరితో ఎఫైర్ నిజమే... హింట్ ఇచ్చేసిన సిద్ధార్థ్!

హీరోయిన్ అదితిరావ్ హైదరి, హీరో సిద్దార్థ్ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనిపై సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చారు. నిజమే అని ఆయన ఒప్పుకున్నట్లు అయ్యింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 10 2023, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


హీరోయిన్ అదితిరావ్ హైదరితో సిద్దార్థ్ రిలేషన్ లో ఉన్నాడని కొద్దిరోజులుగా  కథనాలు వెలువడుతున్నాయి. చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ ప్రేమ జంట కెమెరా కంటికి పలుమార్లు చిక్కారు. దీంతో... ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారని జనాలు కన్ఫర్మ్ చేసేశారు. ఈ పుకార్లను బలపరిచేదిగా వారి ప్రవర్తన ఉంది. 

26

తాజాగా సిద్ధార్థ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆయన స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఓ డాన్స్ షోకి అతిథిగా హాజరయ్యారు. యాంకర్ శ్రీముఖి ఒక ప్రశ్న అడిగారు. మీరు జీవితాంతం కలిసి డాన్స్ చేయాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని అడగ్గా... 'మా ఊళ్ళో అతిథిదేవోభవ అంటారు' అని సిద్ధార్థ్ సమాధానం చెప్పారు.

36
Aditi Rao Hydari And Siddharth

Aditi Rao Hydari And Siddharth

అతిథిదేవోభవలో అతిధి అనే పేరుంది. కాబట్టి ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారు. అతిధిరావు హైదరిని ఆయన లైఫ్ టైం డాన్స్ పార్టనర్ గా ఉండాలనుకుంటున్నాడు. అంటే దాని అర్థం, ఆమెతో ఆయన సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారని పలువురి వాదన. సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

46
Aditi Rao Hydari And Siddharth

Aditi Rao Hydari And Siddharth

కాగా సిద్ధార్థ్, అదితిరావ్ హైదరిలకు వేరే వ్యక్తులతో పెళ్ళిళ్ళై విడాకులు అయ్యాయి. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు. అప్పటి నుండి మళ్ళీ పెళ్లి మాట ఎత్తలేదు.

56
Aditi Rao Hydari

Aditi Rao Hydari

అదితి చాలా చిన్న వయసులో సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకున్నారు. అనంతరం అతనితో అదితి విడిపోవడం జరిగింది. ఇక వీరి కెరీర్స్ పరిశీలిస్తే ఏమంత ఆశాజనకంగా లేవు. సిద్దార్థ్ హిట్ మూవీలో నటించి ఏళ్ళు దాటిపోతుంది.తెలుగులో అదితి చివరి చిత్రం మహాసముద్రం. ఈ మూవీలో సిద్ధార్థ్ సెకండ్ హీరో రోల్ చేశాడు.

66

సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ టక్కర్ జూన్ 9న విడుదలైంది. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. వివాదాలతో ఆగిపోయిన ఈ చిత్రం తిరిగి సెట్స్ పైకి వెళ్ళింది. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఆయన హీరోగా రెండు తమిళ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved