MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వేసవి సాయంత్రం అంటూ గ్లామరస్ ఫోటోలు పెట్టిన రాశి... ఫోన్ నెంబర్ కావాలంటూ సాయి ధరమ్ షాకింగ్ కామెంట్ 

వేసవి సాయంత్రం అంటూ గ్లామరస్ ఫోటోలు పెట్టిన రాశి... ఫోన్ నెంబర్ కావాలంటూ సాయి ధరమ్ షాకింగ్ కామెంట్ 

హీరోయిన్ రాశి ఖన్నా ఇంస్టాగ్రామ్ ఫోటోలపై హీరో సాయి ధరమ్ తేజ్ కామెంట్ చేశారు. ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 07 2023, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Raashi Khanna

Raashi Khanna

రాశి ఖన్నా-సాయి ధరమ్ తేజ్ మధ్య ఎఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ జంటగా సుప్రీమ్, ప్రతిరోజూ పండగే చిత్రాలు చేశారు. సుప్రీమ్ పర్లేదు అనిపించుకుంది. ప్రతిరోజూ పండగే మాత్రం భారీ విజయం సాధించింది. దర్శకుడు మారుతి కామెడీ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రతిరోజూ పండగే రూపొందించారు.

26
Raashi Khanna

Raashi Khanna


ప్రతిరోజూ పండగే మూవీ షూట్ లో సాయి ధరమ్-రాశి దగ్గరయ్యారనే పుకార్లు వినిపించాయి. ఈ వార్తలపై ఎవరూ నోరు మెదపలేదు. మెల్లగా అవే సద్దుమణిగాయి. ప్రతిరోజూ పండగే అనంతరం రాశి ఖన్నా టాలీవుడ్ కి దూరమయ్యారు. ఆమె కోలీవుడ్ లో వరుస చిత్రాలు చేశారు. 
 

36
Raashi Khanna

Raashi Khanna

కాగా రాశి ఖన్నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో రెస్టారెంట్ లో డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేశారు. ఆ ఫోటోలకు 'ఆహ్లాదకరమైన వేసవి సాయంత్రం' అని కామెంట్ పెట్టింది. కాగా రాశి ఖన్నా ఫోటోలకు సాయి ధరమ్ తేజ్ స్పందించారు. నాకు ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్ నెంబర్ ఇంకా దొరకలేదు... అని కామెంట్ పెట్టాడు. గతంలో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలు రాగా... సాయి ధరమ్ తేజ్ కామెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

46
Raashi Khanna

Raashi Khanna


అలాగే సాయి ధరమ్ తేజ్ రాశి ఖన్నా ఫోటోలను పొగిడారా? లేక విమర్శించారా? అనేది అర్థం కాలేదు. కాగా సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష విజయంతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ప్రస్తుతం మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో మూవీలో నటిస్తున్నారు. జులై నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. 
 

56
Raashi Khanna

Raashi Khanna


ఇక రాశి  కెరీర్ పరిశీలిస్తే....  ఓ హిందీ, రెండు తమిళ చిత్రాలు చేస్తున్నారు.  సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. 2023 జులై 7న యోధ మూవీ విడుదల కానుంది. యోధ సక్సెస్ పై రాశి ఖన్నా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. 
 

66


తమిళంలో ఆమె బిజీ అవుతున్నారు. అయితే  టాలీవుడ్ లో ఆమె కెరీర్ ముగిసినట్లే. గత ఏడాది రాశి నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెకు ఆఫర్స్ డోర్స్ మూసుకుపోయాయి. రాశి ఖన్నాను దర్శక నిర్మాతలు కన్సిడర్ చేయడం లేదు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో వెలుగులోకి వచ్చిన రాశి.... తొలిప్రేమ, జై లవకుశ, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాల్లో నటించారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేయగా రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సినిమాల్లోకి రాక‌ముందు.. ఈ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా.?
Recommended image2
Mahesh Babu: మహేష్ బాబు నటిస్తూ నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Thalapathy Vijay: 2 లక్షల నుంచి 9 కోట్ల వరకు.. దళపతి గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved