ఆ డైరక్టర్ కు చిరంజీవి కాదు రానా ఓకే చెప్పారట
రానా చేయబోయే ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కిస్తారని తెలుస్తంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Actor Rana Daggubatt
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తర్వాత గ్యాప్ తీసుకున్నారు హీరో రానా. గత కొద్ది నెలలుగా ఆయన ప్రొడక్షన్ పనులే చూస్తున్నారు. రజనీతో వెట్టయాన్ లో కనిపించిన ఆయన హీరోగా ఏ సినిమాను కమిటవ్వలేదు. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి సినిమా ఏంటి? అనే విషయంపై ఫిల్మ్‌వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. తేజ దర్శకత్వంలో ‘రాక్షసరాజు’ సినిమా చేస్తున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అది పట్టాలెక్కలేదు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే పౌరాణిక చిత్రం కూడా అనుకున్నారు. అది కూడా ప్రస్తుతం హోల్డ్‌లోనే ఉంది. అయితే ఆయన ఇప్పుడు ఓ దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎవరా దర్శకుడు ..ఏమా కథ.
chiranmega 156jeevi
ఆ దర్శకుడు మరెవరో కాదు కార్తి ‘సర్దార్’తో గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు మిత్రన్ అని తెలుస్తోంది. పి.ఎస్. మిత్రన్ తమిళ చిత్రాలతో పాపులరయ్యాడు. అతడు ప్రత్యేకత ఉన్న దర్శకుడు. హీరో (2019), సర్దార్ (2022), ఇరుంబు తిరై (2018) చిత్రాలతో పాపులరయ్యాడు. ఇరుంబు తిరై అభిమన్యుడు పేరుతో తెలుగులో విడుదలై విజయం సాధించింది.
కొద్ది కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవికి మిత్రన్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో బౌండెడ్ స్క్రిప్ట్ తో అప్రోచ్ అవ్వమని సూచించారుట. కానీ ఆ తర్వాత మెగాస్టార్ బిజీ అయ్యిపోవటంతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. కానీ మిత్రన్ కు తెలుగులో సినిమా చేయాలన్న కోరక మాత్రం పోలేదు. దాంతో రానాని కలిసి కథ చెప్పించారట.
ప్రస్తుతం మిత్రన్... ‘సర్దార్ 2’ పనుల్లో బిజిగా ఉన్నాడు. రానా చేయబోయే ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కిస్తారని తెలుస్తంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రానా నిర్మాణంలో భాగం పంచుకొంటాడని సమాచారం. సైబర్ క్రైమ్ నేపథ్యంలో అభిమన్యుడు లాంటి క్లాసిక్ ని విశాల్ హీరోగా తెరకెక్కించి సంచలనం సృష్టించిన మిత్రన్ ఇప్పుడు రానాతో ఎలాంటి కథ తో చేయబోతున్నారు? అన్నది ఆసక్తిగా మారింది.