బేబీ హీరోయిన్ కి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫిదా.. వైష్ణవి చైతన్యకి ఇస్మార్ట్ హీరో బ్యూటిఫుల్ సర్ప్రైజ్
బేబీ చిత్ర విజయంతో హీరోయిన్ వైష్ణవి చైతన్య గాల్లో తేలిపోతోంది. స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు ఆమె పాత్రకి నటనకి, అందానికి ఫిదా అవుతున్నారు.డెబ్యూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య బ్యూటిఫుల్ లుక్స్, బోల్డ్ పెర్ఫామెన్స్ తో అందరిని ఫిదా చేసింది.
చిన్న చిత్రంగా విడుదలైన 'బేబీ' బాక్సాఫీస్ వద్ద చేసిన సౌండ్ మాత్రం పెద్దది. యువతని ఆకట్టుకుంటూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు, ప్రేక్షకుల పాజిటివ్ రెస్పాన్స్ తో ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
బేబీ చిత్ర విజయంతో హీరోయిన్ వైష్ణవి చైతన్య గాల్లో తేలిపోతోంది. స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు ఆమె పాత్రకి నటనకి, అందానికి ఫిదా అవుతున్నారు.డెబ్యూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య బ్యూటిఫుల్ లుక్స్, బోల్డ్ పెర్ఫామెన్స్ తో అందరిని ఫిదా చేసింది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇలా స్టార్ హీరోలు ఆమెపై ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఆ జాబితాలోకి హీరో రామ్ పోతినేని చేరాడు. రామ్ పోతినేని బేబీ మూవీ చూసిన అనంతరం.. ప్రత్యేకంగా వైష్ణవి చైతన్య కోసం పెద్ద పుష్ప గుచ్చం పంపారు. వైష్ణవికి, బేబీ టీంకి శుభాకాంక్షలు చెబుతూ రామ్ ఈ ఫ్లవర్ బొకే పంపారు. ఎంతో అందంగా ఉన్న ఫ్లవర్స్ చూసి వైష్ణవి చైతన్య మురిసిపోతోంది.
రామ్ లాంటి క్రేజీ హీరో తనకోసం ఫ్లవర్స్ పంపడంతో వైష్ణవి ఫిదా అవుతోంది. ఫ్లవర్స్ ని అందంగా హత్తుకుంటూ మురిసిపోతోంది. ఈ ఫోటో ని వైష్ణవి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏ సందర్భంగా వైష్ణవి రామ్ కి కృతజ్ఞతలు తెలిపింది. దీనితో నెటిజన్లు కామెంట్స్ పెడుతూ వైష్ణవికి స్టార్ హీరోలలో, టాలీవుడ్ లో క్రేజ్ పెరుగుతోంది. ఆమె దశ తిరిగినట్లే అని అంటున్నారు.
బేబీ చిత్రం తర్వాత ఆమెకి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. వైష్ణవి యూట్యూబర్ గా రీల్స్ చేస్తూ, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందింది. అయితే వైష్ణవి ఇంత క్రేజీ హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
తెలుగమ్మాయిగా టాలీవుడ్ లో సంచలనం మొదలు పెట్టిన వైష్ణవి ఫ్యూచర్ లో ఎలాంటి చిత్రాలు చేస్తుందో అని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ చిత్రాన్ని ఎస్ కె ఎన్ నిర్మించారు. 11 రోజుల్లో బేబీ చిత్రం వరల్డ్ వైడ్ గా 33 కోట్లకి పైగా షేర్ సాధించింది. నిర్మాతకి, బయ్యర్లకి ఈ చిత్రం లాభాల పంట పండించింది.