MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జీవితని హీరోయిన్‌గా రిజెక్ట్ చేసిన రాజశేఖర్‌, కట్‌ చేస్తే నెక్ట్స్ డే ఆయన్నే మార్చేశారు.. ఆ మూవీ ఏంటో తెలుసా?

జీవితని హీరోయిన్‌గా రిజెక్ట్ చేసిన రాజశేఖర్‌, కట్‌ చేస్తే నెక్ట్స్ డే ఆయన్నే మార్చేశారు.. ఆ మూవీ ఏంటో తెలుసా?

Rajasekhar-jeevitha: హీరో రాజశేఖర్‌ కెరీర్‌ ప్రారంభంలో ఓ విచిత్రమైన అనుభవాన్ని ఫేస్‌ చేశాడు. హీరోయిన్‌ జీవితని సినిమా నుంచి తీసేయాలని దర్శకుడికి చెప్పగా నెక్ట్స్ డే హీరోగా తననే మార్చేశారు.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 04 2025, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
rajasekhar (photo credit etv)

rajasekhar (photo credit-etv)

Rajasekhar: డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యారనేది సినిమాల్లో వినిపించే రొటీన్‌ డైలాగ్‌. కానీ డాక్టర్‌ అయిన తర్వాత హీరో అయ్యాడు రాజశేఖర్‌. ఆయన తమిళంలో హీరోగా కెరీర్‌ ప్రారంభించి `ప్రతిఘటన` సినిమాతో 1985లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రారంభంలో విజయశాంతితో కలిసి ఎక్కువ సినిమాలు చేసి మెప్పించారు. `వందేమాతరం`, `రేపటి పౌరులు` వంటి సినిమాలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

`తలంబ్రాలు` సినిమాలో జీవితతో కలిసి నటించాడు రాజశేఖర్‌. వీరికిది తొలి మూవీ. ఈ సినిమాతోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమ చిగురించి, పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఈ మూవీ కంటే ముందే మరో సినిమాలో ఇద్దరు జోడీ కట్టాల్సింది.

ఓ రోజు షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. కానీ సడెన్‌గా రాజశేఖర్‌ని తీసేశారు. అయితే ముందు ఇందులో హీరోయిన్‌గా జీవితని తీసేయమన్నాడు రాజశేఖర్‌. కట్‌ చేస్తే నెక్ట్స్ డే ఆయన్నే హీరోగా తీసేశారు. మరి ఇంతకి ఏం జరిగింది? ఆ మూవీ ఏంటనేది చూస్తే. 
 

36
rajasekhar (photo credit-etv)

rajasekhar (photo credit-etv)

రాజశేఖర్‌ ప్రారంభంలో రెండు మూడు తమిళ సినిమాలు చేశారు. అందులో భాగంగా `హాలో యార్‌ పెసురతు` అనే మూవీలో రాజశేఖర్‌ మొదట హీరోగా ఎంపికయ్యారు. దీనికి అప్పట్లో హీరోగా రాణిస్తున్న రామరాజన్‌ దర్శకుడు. హీరోయిన్‌గా జీవితని ఎంపిక చేశారు. ఆమె మొదటి రోజు షూటింగ్‌ రాలేదు. రెండో రోజు షూటింగ్‌ కి వచ్చింది. బాగా జ్వరంతో వణికిపోతుంది.

రాజశేఖర్‌ డాక్టర్‌ కావడంతో ఆమెని చూసి ట్రీట్‌మెంట్‌ ఇచ్చాడు. కాస్త రిలాక్స్ అయ్యింది. కానీ సినిమాలో హీరోయిన్‌ది గ్లామర్‌ రోల్‌. కానీ జీవిత చాలా హోమ్లీగా కనిపిస్తుంది. ఈమె ఎలా సెట్‌ అవుతుంది, కష్టమే అనే భావనతో రాజశేఖర్‌ ఉన్నారు. 
 

46
rajasekhar (photo credit-etv)

rajasekhar (photo credit-etv)

అయితే ముందు రోజు రాజశేఖర్‌పై షూటింగ్‌ చేశారు రామరాజన్‌. ఆయన ఎలా చేయాలో చెప్పారట, కానీ రాజశేఖర్‌ అలా చేయడం లేదు, తనకు నచ్చినట్టు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కో సీన్‌కి పదికిపైగా టేకులు తీసుకుంటున్నాడట. రెండో రోజు జీవితతో సీన్ల విషయంలోనూ అదే జరిగింది.

ఆ రోజు షూటింగ్‌ అయిపోయాక దర్శకుడు రామరాజన్‌ వచ్చి ఏంటి డాక్టర్‌ గారు హీరోయిన్‌ ఎలా ఉంది? అని అడిగాడు. రాజశేఖర్‌ స్పందిస్తూ హీరోయిన్‌ కష్టం సార్‌, పాత్ర గ్లామర్‌గా ఉంది, అమ్మాయి హోమ్లీగా కనిపిస్తుంది, కష్టం హీరో్యిన్‌ ని మార్చేయండి అన్నాడట. డైరెక్టర్‌, నిర్మాతతో డిస్కషన్‌ జరిగింది. అంతా ఓకే అనుకున్నారు.
 

56

ఆ రోజు షూటింగ్‌ అయిపోయింది. నెక్ట్స్ డే షూటింగ్‌ లేదు. మరో నాలుగు రోజుల తర్వాత షూటింగ్‌ ఉంటుంది, బండి పంపిస్తాం వచ్చేయండి అన్నారట దర్శక, నిర్మాతలు. కానీ నాలుగు రోజులు కాదు కదా, పది రోజులైనా బండి రాలేదు. ఏం జరిగిందని కనుక్కుంటే హీరోనే మార్చేశారని తెలిసింది.

దీంతో తాను షాక్‌కి గురయినట్టు తెలిపారు రాజశేఖర్‌. అలీతో సరదాగా టాక్‌ షోలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ మూవీలో రాజశేఖర్‌ పాత్రలో అప్పటి హీరో సురేష్‌ని తీసుకున్నారు.

1985లో ఈ మూవీ విడుదలైంది. బాగానే ఆడింది. కానీ అదే ఏడాది రాజశేఖర్‌ తెలుగులో `ప్రతిఘటన`, `వందేమాతరం` వంటి బిగ్‌ బ్లాస్టర్స్ లో భాగమయ్యాడు, ఇక్కడ హీరోగా నిలబడిపోయారు. వరుసగా ఆఫర్లు అందుకున్నారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

66
rajasekhar (photo credit-etv)

rajasekhar (photo credit-etv)

రాజశేఖర్‌ ప్రస్తుతం హీరోగా రాణించేందుకు స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఆయన మూడేళ్ల క్రితం `శేఖర్‌`మూవీలో నటించారు. ఇది ఆడలేదు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండేళ్ల క్రితం `ఎక్స్ ఆర్డినరీ మ్యానర్‌` చిత్రంలో నితిన్‌తో కలిసి నటించారు. ఈ మూవీ ఆడలేదు. దీంతో మళ్లీ క్యారెక్టర్స్ చేయడం లేదు. ఇప్పుడు శర్వానంద్‌ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. 

read  more: సాయి పల్లవి బెస్ట్ డాన్సర్‌ అవ్వడానికి కారణం అయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఆ కోరిక తీరిపోయిందట!

also read: దేశంలోనే వేల కోట్ల అధిపతి వలలో ఐశ్వర్య రాయ్! ఎవరా కుబేరుడు?, ఏం జరిగింది?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Recommended image3
Maheshbabu Reality: మహేష్‌ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved