- Home
- Entertainment
- సాయి పల్లవి బెస్ట్ డాన్సర్ అవ్వడానికి కారణం అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ కోరిక తీరిపోయిందట!
సాయి పల్లవి బెస్ట్ డాన్సర్ అవ్వడానికి కారణం అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ కోరిక తీరిపోయిందట!
సాయిపల్లవి బెస్ట్ డాన్సర్ అనే విషయం తెలిసిందే. అయితే ఆమె డాన్స్ కి ఓ స్టార్ హీరో కారణమట. మరి ఆయన ఎవరు? ఎలా ఇన్‌స్పైర్ చేశారనేది చూద్దాం

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి సినిమాలో ఉందంటే ఆ మూవీ హిట్ పక్కా. ఆమె స్క్రిప్ట్ ల సెలక్షన్ ఆ రేంజ్‌లో ఉంటాయి. ఆమె సినిమా ఒప్పుకుందంటే కచ్చితంగా అందులో విషయం ఉన్నట్టే. `ఫిదా` నుంచి `అమరన్`, `తండేల్` వరకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. హీరో ఎవరైనా వెండితెరపై సాయిపల్లవి చేసే మ్యాజిక్ వేరే లెవల్. ఆమెని చూడ్డానికి చాలా మంది ఆడియెన్స్ వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆమె నటనతోపాటు డాన్సులకు ఫిదా కానీ ఆడియెన్స్ ఉండరు.
Sai pallavi,
సాయిపల్లవిలో నటి కంటే డాన్సులనే ఎక్కువగా ఇష్టపడతారు. అంతగా తనదైన డాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. నెమలిలా డాన్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే సాయి పల్లవి ఇంత మంచి డాన్సర్ కావడానికి, ఆమె బెస్ట్ డాన్సర్ కావడం వెనుక ఒక సూపర్ స్టార్ ఉన్నాడట. మరి ఆ స్టార్ ఎవరు? ఎవరిని చూసి సాయిపల్లవి అంతగా ఇన్‌స్పైర్ అయ్యిందనేది చూస్తే.
సాయిపల్లవి అంతగా ఇన్‌స్పైర్ అయ్యింది ఎవరినో కాదు, మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. తను డాన్సర్ అవ్వాలనుకున్నది చిరంజీవిని చూశాకే అని తెలిపింది. అంతేకాదు అందుకు ఓసినిమా కారణమట. చిరంజీవి నటించిన `ముఠామేస్త్రి` సినిమాని చూసి ఆమె ఇన్‌స్పైర్ అయ్యిందట. ఆ మూవీని ఎన్నో సార్లు చూశానని తెలిపింది సాయిపల్లవి. `నేను చిన్నప్పుడు చిరంజీవి `ముఠామేస్త్రి` సినిమా తెగ చూసేదాన్ని. ఆయన డాన్స్ కి నేను ఫిదా అయ్యి. డాన్సర్ ని అవ్వాలని అనుకున్నాను. ఒక ఈవెంట్‌లో చిరంజీవి గారితో డాన్స్ చేశాను. అది నా కొక మరిచిపోలేని జ్ఞాపకం` అంటూ వెల్లడించింది సాయిపల్లవి.
ప్రస్తుతం సాయిపల్లవి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి, సాయి పల్లవి కలిసి నటించాల్సింది. `భోళా శంకర్` మూవీలో కీర్తిసురేష్ పాత్రకి సాయిపల్లవిని అడిగిన విషయం తెలిసిందే. కానీ ఆమె నో చెప్పింది. అయితే సాయి పల్లవి నో చెప్పడమే తనకు హ్యాపీ అని వెల్లడించారు చిరంజీవి. `లవ్ స్టోరీ` సినిమా ఈవెంట్‌కి ఆయన అనుకోకుండా వెళ్లారు. ఆ కార్యక్రమంలో సాయిపల్లవి గురించి తెలిపారు. తాను సాయిపల్లవితో డాన్స్ చేయాలనుకుంటాను అని, అలాంటి మూవీ కోసం వెయిట్ చేస్తానని ఆయన చెప్పడం విశేషం.
Sai pallavi
సాయిపల్లవి ఇటీవల `తండేల్` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీకి చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ మూవీ గత నెలలో విడుదలై వంద కోట్లు వసూలు చేసింది. ఇంకా ఆమె తెలుగులో మరే సినిమా ఒప్పుకోలేదు. కానీ కోలీవుడ్‌లో శింబుతో కలిసి నటించబోతుందని సమాచారం.