రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం బయట పెట్టిన జీవిత.. వీరి లవ్ స్టోరీ ఎక్కడ మొదలైందంటే..
సీనియర్ హీరో రాజశేఖర్ - జీవిత ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలిసిందే. అయితే వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది. ఇంతకీ రాజశేఖర్ ను జీవిత పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో తాజాగా బయపెట్టింది జీవిత. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డాక్టర్ వృతిని వీడి సినిమాలపై ఆసక్తితో సీనియర్ హీరో రాజశేఖర్ నటుడిగా మారాడు. 1984లో మొదలైన తన సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్నో చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. 1991లో నటి, దర్శకురాలు జీవితను పెళ్లి చేసుకున్నారు. రాజశేఖర్ - జీవిత దంపతులు ఏ ఈవెంట్ లోనైనా కలిసే హాజరవుతూ సందడి చేస్తున్నారు.
అయితే రాజశేఖర్ - జీవితకు సంబంధించిన లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైంది? ఇంతకీ రాజశేఖర్ ను జీవిత పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఏంటనేది తాజాగా రివీలైంది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో జీవితనే స్వయంగా వారి ప్రేమ కథను వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
1987లో వచ్చిన ‘తలంబ్రాలు’ చిత్రంతో రాజశేఖర్ - జీవితా కలిసి నటించారు. ఆ సినిమాతోనే వీరి ఇద్దరి ప్రేమకు బీజం పడింది. ఇంటర్వ్యూలో జీవిత వారి ప్రేమ గురించి మాట్లాడుతూ.. తలంబ్రాలు సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పద్మాలయ స్టూడియోలోనే ఎక్కువ సమయం గడిపేవాళ్లం. అలా దగ్గరయ్యాం.
ఆసమయంలోనే రాజశేఖర్ ను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది. తన హ్యుమన్ బీయింగ్ కూడా నచ్చింది. పైగా అందంగానూ, ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆకట్టుకునే వారు. ఎలాంటి సీక్రెట్స్ ను దాచారు. ఆయన క్యారెక్టర్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సరదాగా ఉంటారు. ఆ క్వాలిటీస్ బాగా నచ్చాయి. ఇక అలా ఇద్దరం కలిసిపోయాం. కానీ అప్పటి వరకు ప్రపోజ్ చేయలేదు.
ఓ రోజు తనను ఇష్టపడుతున్న విషయాన్ని తెలుసుకొని తమ ఇంట్లో అస్సలు ఒప్పుకోరని చెప్పారు. ఇంట్లో వాళ్లని ఎదురించి బయటికి రావడం తన వల్ల అయ్యే పనికాదని చెప్పారన్నారు. ఆ తర్వాత అన్ని సర్దుకున్నాయని చెప్పారు. అయితే వీరి లవ్ స్టోరీలో మొదట జీవితనే రాజశేఖర్ కు ప్రపోజ్ చేసిందంట. ఈ విషయాన్ని రాజశేఖర్ వెల్లడించారు.
అయితే, జీవితను పెళ్లి చేసుకోవడం వల్ల తను చాలా సంతోషంగా ఉన్నానంటూ రాజశేఖర్ వెల్లడించారు. తనను అన్ని విధాలుగా ముందు నడిపించిందంటూ చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికి వీరి లవ్ స్టోరీ రివీల్ కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు శివాణి, శివాత్మిక ఉన్నారు. వీరూ యంగ్ యాక్ట్రెస్ గా అవకాశాలు అందుకుంటున్నారు.