ఆయన డైలాగ్స్ అంటే ప్రభాస్ కి పిచ్చి, ప్రపంచంలోనే నెంబర్ వన్, స్వయంగా చెప్పిన డార్లింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకరికి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆయనకి డైలాగ్స్ నేను పిచ్చ ఫ్యాన్ అన్నారు. ప్రపంచంలోనే ఆ విషయంలో ఆయన నెంబర్ వన్ అన్నారు. ఇంతకీ ఎవరతను?
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ఈశ్వర్ మూవీతో ఆయన జర్నీ మొదలైంది. 2002లో విడుదలైన ఈశ్వర్ విజయం అందుకుంది. ఇక ప్రభాస్ కి ఫస్ట్ సూపర్ హిట్ వర్షం. 2004 సంక్రాంతి కానుకగా విడుదలైన వర్షం.. విన్నర్ గా నిలిచింది. చిరంజీవి నటించిన అంజి ప్లాప్ కాగా, బాలకృష్ణ హీరోగా చేసిన లక్ష్మి నరసింహ హిట్ టాక్ తెచ్చుకుంది. అతిపెద్ద విజయం వర్షం సాధించింది.
అనంతరం ప్రభాస్ చేసిన ఛత్రపతి, యోగి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలు టాప్ హీరోల్లో ఒకరిగా నిలబెట్టాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేశాయి. 2015లో విడుదలైన బాహుబలి పాన్ ఇండియా హిట్. దానికి కొనసాగింపుగా 2017లో బాహుబలి 2 విడుదలైంది. ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇండియా పరిథిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 ఉంది. ఆ రికార్డు బ్రేక్ కాలేదు.
ప్రభాస్ ఇమేజ్ రాజమౌళి పుణ్యమే అనే వారికి తన తదుపరి చిత్రాలతో ప్రభాస్ సమాధానం చెప్పాడు. సాహో తెలుగులో ప్లాప్ కానీ హిందీ లో హిట్ అయ్యింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ నిరాశ పరిచినప్పటికీ సలార్, కల్కి చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. కల్కి రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.
ఇక కెరీర్లో ప్రభాస్ అత్యధికంగా రాజమౌళితో మూడు సినిమాలు చేశాడు. అనంతరం దర్శకుడు పూరి జగన్నాధ్ తో రెండు చిత్రాలు చేశాడు. పూరి జగన్నాధ్-ప్రభాస్ కాంబోలో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ చిత్రాలు తెరకెక్కాయి. ఈ రెండు చిత్రాలు యావరేజ్, అయితే ప్రభాస్ సరికొత్తగా కనిపిస్తాడు. గతంలో దర్శకుడు పూరి జగన్నాధ్ పై తన అభిప్రాయం తెలియజేశాడు ప్రభాస్.
సెట్స్ లో పూరి జగన్నాధ్, ప్రభాస్ చాలా జోవియల్ గా ఉంటారట. సరదాగా కొట్టుకుంటారట. తనకు పూరి బెస్ట్ ఫ్రెండ్ అట. ఇక పూరి జగన్నాధ్ డైలాగ్స్ కి ప్రభాస్ పెద్ద ఫ్యాన్ అట. సూటిగా ముఖం మీద పెట్టి కొట్టినట్లు పూరి జగన్నాధ్ డైలాగ్స్ ఉంటాయని ప్రభాస్ అన్నాడు. బుజ్జిగాడు మూవీలో తమిళ్ డైలాగ్స్ ఆయనే రాశాడట. లారీ వచ్చి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అంటే రొటీన్.. టిప్పర్ లారీ స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా.. అని రాస్తే కిక్ ఇస్తుంది, అని ప్రభాస్ అన్నాడు.
.
ఏక్ నిరంజన్ అనంతరం ప్రభాస్, పూరి కలిసి పని చేయలేదు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ స్ట్రగుల్ లో ఉన్నారు. ప్రభాస్ ఆయనకు అందనంత ఎత్తులో ఉన్నాడు. పూరి జగన్నాధ్ కి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చే అవకాశం అసలు లేదు. హను రాఘవపూడి, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చిత్రాలు ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.
ఇక పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అనంతరం ఆయన తెరకెక్కించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ దారుణ పరాజయం చవి చూశాయి. పూరి జగన్నాధ్ కొత్త మూవీ ప్రకటించాల్సి ఉంది. మరి ఏ హీరో ఆయనకు ఛాన్స్ ఇస్తాడో చూడాలి. పూరి జగన్నాధ్ టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో సినిమాలు చేశాడు. రామ్ చరణ్ ని ఇండస్ట్రీకి పూరి జగన్నాధ్ పరిచయం చేశాడు.