Nikhil Spy First Review: నిఖిల్ స్పై ఫస్ట్ రివ్యూ... సెన్సార్ టాక్ ఎలా ఉందంటే!
యంగ్ హీరో నిఖిల్ భారీ చిత్రాలు చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ స్పై. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన స్పై చిత్రానికి గ్యారీ బి హెచ్ దర్శకుడు. జూన్ 29న మూవీ విడుదల కానుంది.
Spy Movie Review
కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు నిఖిల్. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసిన నిఖిల్ భారీ చిత్రాలు చేస్తున్నారు. నిఖిల్ మార్కెట్ పెరిగిన నేపథ్యంలో మేకర్స్ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన స్పై అంటూ యాక్షన్ థ్రిల్లర్ చేశారు. స్పై చిత్ర ప్రోమోలు ఆకట్టుకున్నాయి. సినిమా మీద అంచనాలు పెంచేశాయి.
ఇక ట్రైలర్ లో కథ ఏమిటో చెప్పేశారు. ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఒక మిస్టరీగా ఉంది. ఆయన విమాన ప్రమాదంలో మరణించారని ప్రచారంలో వాదన. అలాగే మరికొన్ని థియరీలు కూడా వినిపించాయి. ఇండియన్ గవర్నమెంట్ నేతాజీ మరణం వెనుక కారణాలు రహస్యంగా ఉంచారని కూడా కొందరు నమ్ముతారు.
నేతాజీ మరణం వెనకున్న కారణాలు ఏంటి? అనేదే స్పై మూవీ. ఆ నిజాలు వెలికితీసే గూఢచారిగా నిఖిల్ నటిస్తున్నారు. స్పై మూవీ విడుదలకు సిద్దమైన నేపథ్యంలో సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల టాక్ ఏమిటో చూద్దాం...
స్పై మూవీకి సెన్సార్ మెంబర్స్ ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక వారి అభిప్రాయంలో సినిమా బాగుంది. ఉన్నతమైన నిర్మాణ విలువలు, అబ్బురపరిచే విజువల్స్, థ్రిల్ చేసే ట్విట్స్, యాక్షన్ సన్నివేశాలతో స్పై తెరక్కిందంటున్నారు. సెన్సార్ సభ్యుల అభిప్రాయంలో స్పై ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుందంటున్నారు.
సెన్సార్ రిపోర్ట్ నిఖిల్ ఫ్యాన్స్ లో ఆనందం నింపింది. స్పై పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో నిఖిల్ భారీగా ప్రోమోట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ చిత్రాన్ని ప్రోమోట్ చేశారు. స్పై విజయం సాధించిన నేపథ్యంలో నిఖిల్ ఇమేజ్ మరో స్థాయికి వెళుతుంది.
స్పై మూవీలో నిఖిల్ కి జంటగా ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. దగ్గుబాటి రానా చిన్న క్యామియో రోల్ చేయడం విశేషం. కే రాజశేఖర్ రెడ్డి కథ అందించారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కూడాను. విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకల మ్యూజిక్ అందించారు.