- Home
- Entertainment
- విదేశాల్లో లగ్జరీ లైఫ్... హీరో మహేష్ వైఫ్ నమ్రత రాజభోగాలు చూసి కుళ్ళుకుంటున్న జనాలు!
విదేశాల్లో లగ్జరీ లైఫ్... హీరో మహేష్ వైఫ్ నమ్రత రాజభోగాలు చూసి కుళ్ళుకుంటున్న జనాలు!
హీరో మహేష్ బాబు సతీమణి ఫారిన్ టూర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న నమ్రత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు.

Namrata Shirodkar
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సమ్మర్ వెకేషన్ లో ఉన్నారు. ఆమె పిల్లలతో పాటు ఫ్రాన్స్ వెళ్లారు. ఈ టూర్ మహేష్ మిస్ అయ్యారు. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ ఇండియాలో ఉండిపోవాల్సివచ్చింది. దీంతో సితార, గౌతమ్ లను తీసుకుని నమ్రత వెళ్లారు.
Namrata Shirodkar
ఇక ఫ్రాన్స్ లో నమ్రత వైభోగం చూసి నెటిజెన్స్ వావ్ అంటున్నారు. అదే సమయంలో లైఫ్ అంటే మీదే అంటూ కుళ్లుకుంటున్నారు. నమ్రత ఈఫిల్ టవర్ దగ్గర్లో గల ది రోజ్ వుడ్ లగ్జరీ హోటల్ లో ఆరగించారు. 1758లో నిర్మించిన ఈ హోటల్ కి ఘన చరిత్ర ఉంది. బాగా డబ్బునోళ్లు మాత్రమే వెళ్లగలిగే హోటల్ అది. సదరు హోటల్ లో స్టైలిష్ గా ఫోటోలు దిగి షేర్ చేశారు. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
Namrata Shirodkar
ఇక మహేష్-నమ్రత టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే సింపుల్ గా మహేష్-నమ్రతలను చూపిస్తే సరిపోతుంది. అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది. ముంబైలో పుట్టిన పెరిగిన ఒక అల్ట్రా మోడ్రన్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సాంప్రదాయంగా నమ్రత ఉంటారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు.
Namrata Shirodkar
మహేష్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రతనే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఏమాత్రం విరామం దొరికినా భార్యాపిల్లలలో ఫారిన్ ట్రిప్ కి చెక్కేస్తారు. మహేష్ ప్రతి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోయే ముందు, ఆ చిత్రం విడుదలయ్యాక ట్రిప్ కి వెళతారు. ఇది ఆయన ఒక అలవాటుగా, సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. నెలల తరబడి సాగిన షూటింగ్ లో పడ్డ కష్టమంతా వెకేషన్ లో మర్చిపోతాడు.
Namrata Shirodkar
వంశీ సినిమా షూటింగ్ లో నమ్రత-మహేష్ మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం. గత ఏడాది మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. 2022 జనవరిలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ లో అమ్మ ఇందిరాదేవి మరణించారు. ఇక నవంబర్ 15న తండ్రి కృష్ణ కన్నుమూశారు. ఏడాది వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులను మహేష్ కోల్పోయారు.