అలా లేకపోతే సినిమాలు మానేస్తా అంటూ ప్రకటించిన యంగ్ హీరో, కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కిరణ్ అబ్బవరం సవాల్ విసిరాడు. తాను నటిస్తున్న సినిమా `క`కి సంబంధించిన ఆయన షాకింగ్ కామెంట్ చేశాడు. అలా లేకపోతే సినిమాలు మానేస్తా అని ప్రకటించారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలు చవి చూసిన ఆయన తన పంథా మార్చి కంటెంట్ ఉన్న చిత్రాలతో రాబోతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `క` అనేసినిమాలో నటించారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్‌లు హీరోయిన్లుగా నటించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ సంయక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ పీరియాడికల్ మూవీగా, థ్రిల్లర్ ప్రధానంగా సాగే ఈ సినిమాకి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్మెంట్స్ తో కలిసి చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు.
`క` సినిమా దీపావళి స్పెషల్‌గా ఈ నెల 31న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ సినిమా నచ్చకపోతే సినిమాలు చేయడం మానేస్తా అని ప్రకటించారు. అయితే అందులో ఓ ట్విస్ట్ ఉంది. సినిమా కొత్తగా ఉంటుందని, రెగ్యూలర్ సినిమాలా ఉండదని, స్క్రీన్ ప్లే హైలైట్‌గా నిలుస్తుందన్నారు.
శనివారం ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్‌లో ఈ విషయాన్ని తెలిపారు. ఇందులో క్లైమాక్స్ కొత్తగా ఉంటుందన్నారు. దాన్ని రిపోర్టర్ ప్రశ్నించగా, ఆ కొత్తదనం ఏంటో సినిమా చూస్తే తెలుస్తుందని, కచ్చితంగా అదొక కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుందన్నారు.
`క` సినిమాలో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తా` అని సవాల్ విసిరాడు. అంతేకాదు ఆ మాటకు తాను కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. ఇంకా చెబుతూ, `వాసుదేవ్ అనే క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉన్నాయి. గ్రే షేడ్స్ కూడా కనిపిస్తాయి. వాసుదేవ్ కు పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరిక.
అందుకే వేరేవాళ్ల ఉత్తరాలు చదువుతుంటాను. ఆ క్రమంలో అతని లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. "క" సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం` అని చెప్పారు కిరణ్ అబ్బవరం.
సినిమాకి తమిళంలో వివక్ష గురించి చెబుతూ, సినిమాని పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నారు. కానీ తమిళంలో థియేటర్లు దొరకలేదట. ఈ మూవీకి థియేటర్లు ఇవ్వడం లేదని తెలిపారు. మనవాళ్లకి అక్కడ ఆదరణ దక్కడం లేదని, దానికి ఇంకా టైమ్ ఉందని తెలిపారు కిరణ్ అబ్బవరం. తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తే మిగిలిన భాషల్లో రిలీజ్ చేస్తామని తెలిపారు. సినిమా గురించి చెబుతూ,
`ఈ సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి ఒక మంచి కథ ప్రేక్షకులకు చూపించాలి అనిపించింది. నా గత సినిమాల్లో కంటెంట్ పరంగా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అలాంటివి లేకుండా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఎంతో జాగ్రత్తగా సినిమాను చేశాం. దీని వెనక మా టీమ్ లోని ప్రతి ఒక్కరి కృషి ఉంది. మా మూవీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్స్ మొత్తం సర్ ప్రైజ్ చేస్తాయి.
సినిమాలో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఫైట్స్ కూడా భారీగా కావాలని పెట్టలేదు. ఇదొక థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వెళ్తుంటుంది. కథలో కావాల్సివచ్చినప్పుడు మాత్రమే యాక్షన్ సీన్స్ పెట్టాం. సినిమాలో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తా. వాసుదేవ్ అనే క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉన్నాయి.
గ్రే షేడ్స్ కూడా కనిపిస్తాయి. వాసుదేవ్ కు పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరిక. అందుకే వేరేవాళ్ల ఉత్తరాలు చదువుతుంటాను. ఆ క్రమంలో అతని లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. "క" సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం` అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు, దర్శకుడు పాల్గొన్నారు.
read more: రంభ అసలు పేరేంటో తెలుసా? ఎలా మారిందంటే? పాపం చిన్న పిల్లని చేసి ఆడుకున్నారట
Also read: ప్రభాస్ బావ అని పిలిచే హీరో ఎవరో తెలుసా? ఆ స్టార్ హీరోయినే కారణమా?