రంభ అసలు పేరేంటో తెలుసా? ఎలా మారిందంటే? పాపం చిన్న పిల్లని చేసి ఆడుకున్నారట
ఇరవై ఏళ్ల క్రితం గ్లామర్ క్వీన్‌గా ఓ ఊపు ఊపేసిన రంభ.. అసలు పేరేంటో తెలుసా? అది ఎలా మారింది? ఎవరు మార్చారు? దానివెనుక న్న క్రేజీ స్టోరేంటో తెలుసా?
హీరోయిన్ రంభ పేరు వింటే ఆమె నటించిన గ్లామర్ పాత్రలు, పాటలే గుర్తొస్తాయి. అంతగా టాలీవుడ్‌లో గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకుంది రంభ. అప్పటి కుర్రాకారుని ఓ ఊపు ఊపేసింది. సినిమాలో రంభ ఉందంటే మాస్ ఆడియెన్స్ కి పండగే. ఆమె కోసం క్యూ కట్టే ఆడియెన్స్ చాలా మంది ఉండేవారు. కుర్రకారు నుంచి, పెద్ద వయసు వాళ్లు సైతం ఆమె సినిమాలు చూసేందుకు ఇష్టపడేవాళ్లు, థియేటర్‌కి క్యూ కట్టేవాళ్లు. అంతటి కిక్ ఆమె ట్రీట్‌లో, డాన్సుల్లో ఉండేది.
అప్పట్లో అత్యంత బిజీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రంభ. ఓ వైపు రమ్యకృష్ణ, సౌందర్య, మీనా, నగ్మా వంటి కథానాయికలు జోరు మీదున్నారు. వాళ్లు బాగా నటిస్తారు, గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటారు. వాళ్లని తట్టుకుని నిలబడటం అంటే మామూలు విషయం కాదు, కానీ రంభ నిలబడింది. ఇంకా చెప్పాలంటే వాళ్లందరికి పోటీ ఇచ్చింది. కొన్ని సందర్భాల్లోవాళ్లంతా కుళ్లుకునేలా చేసింది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ పరిశ్రమలను షేక్ చేసింది. కరెక్ట్ గా పదేళ్లు ఆమె ఇండస్ట్రీలో ఉంది. వందకు పైగా సినిమాలు చేసింది. ఏడాదికి పదికిపైగా సినిమాలు ఆమె నుంచి వచ్చేవంటే రంభ ఎంత బిజీగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి వంటి బిగ్ స్టార్స్ సైతం రంభ డేట్స్ కోసం వెయిట్ చేసిన రోజులున్నాయి. నాగార్జున వంటి హీరోకి డేట్స్ ఇవ్వలేకపోయ్యింది రంభ.
అంతటి బిజీ హీరోయిన్‌గా నిలిచిన రంభ పెళ్లి చేసుకున్నాక సినిమాలకు గుడ్ బై చెప్పింది. మధ్యలో ఒకటి అర చిత్రాల్లో కనిపించింది. స్పెషల్ సాంగ్స్ తో ఊపేసింది. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమయ్యింది. ఈ నేపథ్యంలో ఆ మధ్య మీడియాతో మాట్లాడింది. మళ్లీ తాను సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో తన పేరు వెనుక స్టోరీ బయటపెట్టింది రంభ. ఈ పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారనేది వెల్లడించింది.
రంభ తెలుగమ్మాయి. విజయవాడలోనే పుట్టి పెరిగింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి ఈది. హీరోయిన్‌గా ఆమె మలయాళంలో పరిచయం అయ్యింది. `సర్గం` అనే సినిమాలో వినీత్‌కి జోడీగా చేసింది. ఇందులో స్క్రీన్ నేమ్ అమృతగా మార్చాడు ఆ సినిమా దర్శకుడు హరిహరన్. ఆ తర్వాత తెలుగులో `ఆ ఒక్కటి అడక్కు` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాజేంద్రప్రసాద్ సరసన నటించింది.
అమృత అనే పేరుతో అప్పట్లో చాలా మంది నటీమణులు ఉన్నారు. దీంతో కొత్తగా ఏదైనా పెట్టాలనుకున్నారు. `ఆ ఒక్కటి అడక్కు` సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు రంభ. అందుకే దాన్నే రియల్ స్క్రీన్ నేమ్‌గా పెట్టాలనుకున్నారట దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. దీంతో ఆమె కూడా ఓకే చెప్పింది. అలా విజయలక్ష్మి కాస్త రంభగా మారింది.
అయితే ఆ పేరు మార్చే సమయంలో తనకు ఏమీ తెలియదట. అప్పటికీ తాను చాలా చిన్నపిల్లలను. బాగా డాన్సు చేస్తున్నా, దర్శకుడు చెప్పినట్టు యాక్ట్ చేస్తున్నా అని అంతా ముచ్చటపడ్డారు. తనకు కూడా అదొక క్రేజీగా అనిపించేది. తనని అప్రిషియేట్ చేస్తుంటే ఏదో అనుకునేదట. ఏమీ అర్థమయ్యేది కాదని తెలిపింది రంభ.
అప్పటికి తన ఏజ్ 16. అందుకే పెద్దగా మెచ్యూరిటీ లేదు. సెట్‌లో అందరు చిన్నపిల్లగా భావించేవాళ్లు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అయితే ఏకంగా చాక్లెట్‌లు తీసుకుని వచ్చేవాడట. ఇది(సీన్) బాగా చేస్తే ఛాక్లెట్ ఇస్తా అనేవాడట. అలా ఛాక్లెట్ల కోసం తాను బాగా నటించడంగానీ, డాన్స్ చేయడం గానీ చేసేదాన్ని అని తెలిపింది రంభ.
ఓ రకంగా రంభని చిన్నపిల్లని చేసుకున్నారు దర్శకుడు ఈవీవీ. అయితే ఇప్పుడు ఇంట్లో తన పిల్లల విషయంలోనూ అలానే చేస్తుందట రంభ. ఆ ఫన్నీ ఎక్స్ పీరియెన్స్ ని ఆమె టీవీ9తో చిట్‌చాట్‌లో వెల్లడించింది. ప్రస్తుతం విదేశాల్లో ఫ్యామిలీతో నివసిస్తుంది రంభ.
Read more: ప్రభాస్ బావ అని పిలిచే హీరో ఎవరో తెలుసా? ఆ స్టార్ హీరోయినే కారణమా?
Also read: బాలయ్య బాబాయ్‌తో కాదు, ఆయనతోనే సినిమా చేస్తా.. ఎన్టీఆర్ బోల్డ్ రియాక్షన్