- Home
- Entertainment
- చిరంజీవి పుండు మీద కారం చల్లిన బాలయ్య.. ఓర్చుకోలేక రియాక్ట్ అయిన నాగబాబు, మెగాస్టార్ కి అదో తీరని అవమానం!
చిరంజీవి పుండు మీద కారం చల్లిన బాలయ్య.. ఓర్చుకోలేక రియాక్ట్ అయిన నాగబాబు, మెగాస్టార్ కి అదో తీరని అవమానం!
చిరంజీవి-బాలకృష్ణ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మరి ఆ హీరోలకు కూడా ఒకరంటే ఒకరికి పడదా? మనోవేదనలో ఉన్న చిరంజీవిని బాలకృష్ణ తన ఘాటైన కామెంట్స్ తో మరింత బాధపెట్టాడు..

80ల వరకు టాలీవుడ్ పై నందమూరి కుటుంబానిదే హవా. నందమూరి తారకరామారావు టాలీవుడ్ టాప్ స్టార్ గా తిరుగులేని స్టార్డం అనుభవించారు. 1982లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. అదే సమయంలో చిరంజీవి నటుడిగా ఎదుగుతున్నాడు. ఎన్టీఆర్ సినిమాలకు దూరం కావడంతో చిరంజీవి ఆయన స్థానంలోకి వచ్చాడు.
NTR Birth anniversary
90ల నాటికి చిరంజీవి స్టార్డం ఫీక్స్ కి చేరింది. ఆయన తిరుగులేని హీరో అయ్యాడు. ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ సైతం స్టార్ హోదా రాబట్టాడు. పై చేయి మాత్రం చిరంజీవిదే. ఆయన మార్కెట్, అభిమానగణం నందమూరి అభిమానుల కంటే ఎక్కువ.
పైకి చిరంజీవి, బాలకృష్ణ మంచిగా కనిపించినా కోల్డ్ వార్ నడిచేది అనే వాదన ఉంది. చిరంజీవి-బాలకృష్ణ అభిమానులు మాత్రం తరచుగా కొట్లాటలకు దిగేవారు. నటుడిగా నందమూరి కుటుంబంపై పై చేయి సాధించిన చిరంజీవి రాజకీయ నాయకుడిగా విఫలం చెందాడు.
ఎన్టీఆర్ తర్వాత సీఎం అయిన నటుడిగా ఆయన రికార్డులకు ఎక్కాలని అనుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. చిరంజీవి గేమ్ ఛేంజర్ అవుతాడు అనుకుంటే.. అంచనాలు తలకిందులు అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీఆర్పీ కేవలం 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.
అనంతరం పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడం చకచకా జరిగిపోయాయి. చిరంజీవి కెరీర్లో పొలిటికల్ ఎంట్రీ మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ విషయం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి చిరంజీవి వేదనకు గురి అవుతాడు. తాను చేసిన అతిపెద్ద తప్పు రాజకీయాల్లోకి రావడం అంటారు.
తీరని వేదన అనుభవిస్తున్న చిరంజీవిని బాలకృష్ణ కామెంట్స్ మరింత బాధించాయి. పైసా వసూల్ మూవీ విడుదల సమయంలో బాలకృష్ణ టీవీ 9 ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ తో పాటు చాలా మంది నటులు రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. మరింత మంది యువత రాజకీయాల్లోకి రావాలని మీరు పిలుపును ఇస్తారా? అని యాంకర్ అడిగింది .
నేను ఇవ్వను అన్నారు బాలకృష్ణ. రాజకీయాలు అంటే ఎమోషన్ కాదు. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు. గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్ కి వెళ్ళాడు. అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే. రాజకీయాల్లో అందరూ రాణించలేరు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు... అన్నారు.
Kiraak RP
చిరంజీవి ఫెయిల్ అయ్యాడు, ఆయన వల్ల కాలేదంటూ బాలకృష్ణ నేరుగా విమర్శలు చేయడం అభిమానులను వేదనకు గురి చేసింది. బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి ఏనాడూ స్పందించలేదు. నాగబాబు మాత్రం 2019లో బాలకృష్ణ మీద ఘాటైన కామెంట్స్ చేశాడు. బ్లడ్, బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. అమితాబ్, చిరంజీవిని విమర్శించే స్థాయి కాదు నీదని వరుస వీడియోలు చేశాడు.. ఈ వివాదం మెల్లగా సమసింది.