బాలకృష్ణ దర్శకత్వంలో మోక్షజ్ఞ, ఏర్పాట్లు మొదలు!
నందమూరి వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాగా వారికి ఓ గుడ్ న్యూస్ అందుతుంది. బాలయ్య దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆ వివరాలు ఏమిటో చూద్దాం..
మోక్షజ్ఞను వెండితెరపై చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే ఆలస్యమైంది. సాధారణంగా హీరోలు కావాలనుకున్న స్టార్ కిడ్స్ 20 ఏళ్ల ప్రాయంలోనే సిద్ధం అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే టీనేజ్ దాటక ముందే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మోక్షజ్ఞ ప్రస్తుత వయసు 30 ఏళ్ళు కాగా ఇప్పటికే ఆయన ఓ 10 సినిమాలు చేయాల్సింది. కారణం ఏదైనా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ డిలే అయ్యింది.
Mokshagna Nandamuri
గత రెండేళ్లుగా బాలకృష్ణ మోక్షజ్ఞను పరిచయం చేయడం కోసం ఏర్పాట్లు మొదలెట్టారు. దర్శకుడు ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ సెట్ చేశాడు. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఒక సోషియో ఫాంటసీ సబ్జెక్టు మోక్షజ్ఞ కొరకు రాశారట. ప్రీ ప్రొడక్షన్ సైతం పూర్తి కాగా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. అయితే మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ ఓ ప్రచారం జరుగుతుంది.
ప్రశాంత్ వర్మ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. అలాగే లాభాల్లో వాటా అడుగుతున్నాడు. అడిగినంత ఇవ్వని పక్షంలో తన అసిస్టెంట్ ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేస్తాడని అంటున్నాడని.. ఓ వార్త తెరపైకి వచ్చింది. ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ మూవీ దాదాపు రద్దు అయినట్లే అని, కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లపై నిర్మాతలు స్పందించారు. ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని తేల్చారు. సందర్భానుసారంగా మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ అప్డేట్స్ వస్తాయని తెలియజేశారు.
కాగా మోక్షజ్ఞను స్వయంగా బాలకృష్ణ తన దర్శకత్వంలో పరిచయం చేయాలని అనుకున్నారు. బాలకృష్ణ కెరీర్లో కల్ట్ క్లాసిక్ గా ఉన్న ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ మోక్షజ్ఞతో చేయాలని బాలకృష్ణ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కథ కూడా బాలకృష్ణనే రాసుకున్నాడు. బాలకృష్ణ బిజీగా ఉండటంతో పాటు రిస్క్ ఎందుకని, ఫస్ట్ మూవీ ఫార్మ్ లో ఉన్న ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు.
తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ఆదిత్య 999 మ్యాక్స్ కి ఏర్పాట్లు మొదలుపెట్టాడట. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. బాలకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మనిషి కాలంలో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? భూత భవిష్యత్ కాలాల్లోకి వెళ్లగలిగితే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? తెలియజేశాడు.
Mokshagna Nandamuri
ఆదిత్య 369 మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఈ చిత్రం అద్భుతంగా చేయవచ్చు. అయితే బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెట్టాల్సి ఉంటుంది. కొత్త హీరోలతో భారీ ప్రాజెక్ట్స్ చేయడం రిస్క్. బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞకు అభిమానుల మద్దతు ఉంటుంది. కాబట్టి మూవీలో మేటర్ ఉంటే పెట్టిన డబ్బులు వెనక్కి రావడం కష్టం కాదు.
అలాగే కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో మరొక చిత్రం ప్లాన్ చేస్తున్నారట. నాగ్ అశ్విన్ సైతం మోక్షజ్ఞతో మూవీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే పుకార్లు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ప్రశాంత్ వర్మ, బాలకృష్ణ, నాగ్ అశ్విన్ లతో మోక్షజ్ఞ చిత్రాలు చేయనున్నాడు. వెంకీ అట్లూరి పేరు కూడా మోక్షజ్ఞ అప్ కమింగ్ దర్శకుల లిస్ట్ లో ఉంది.